ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే ఏపీలోని హైవేస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి మేలు జరిగేలా ఊహించని స్థాయిలో నిధుల కేటాయింపులు జరగడం గమనార్హం. 452 కిలోమీటర్ల హైవేస్ పనుల కోసం 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయి.

సుదీర్ఘ కాలం నుంచి  విస్తరణ  పనుల కోసం  ఉన్న ప్రాజెక్ట్స్ కు ఇప్పుడు మోక్షం లభించనుందని చెప్పడంలో  సందేహం అవసరం లేదు.  ఇప్పుడు వీటికి మోక్షం కలిగినట్టేనని  చెప్పవచ్చు.   రాష్ట్రంలోని కొన్ని హైవే లైన్లు నాలుగు లైన్లుగా మరికొన్ని ఆరు లైన్లుగా  విస్తరించనున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు  మారబోతున్నాయని సమాచారం అందుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం  ఇందుకు సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్టానికి గతంతో పోలిస్తే మెరుగ్గానే నిధులు  కేటాయిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చే దిశగా ఏపీ  సర్కార్ అడుగులు వేయనుందని సమాచారం అందుతోంది.   ఆంధ్రప్రదేశ్ కు మోడీ ఇచ్చిన గిఫ్ట్  విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బాబు చొరవతో ఏపీ అభివృద్ధి జరుగుతోందిగా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీ బీజేపీ తో  పొత్తు పెట్టుకుని మంచి పని చేసిందని   అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  ఏపీలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై  కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో తల్లికి వందనం పథకం అమలు చేయడంతో  ఎంతోమందికి ఈ స్కీమ్  ద్వారా ప్రయోజనం చేకూరనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: