
కృష్ణాజిల్లా పెడన నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట మీదగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు ఉన్న ఈ నేషనల్ హైవే-216 హెచ్ ను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 4,245 కోట్లు కేటాయించింది. మొత్తం 118 కి.మీ విస్తరించనున్నారు. అందులో భాగంగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 చోట్ల బైపాస్‌ను నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే హైవే విస్తరణకు 700 ఎకరాల భూమిని సేకరించాలని.. అందుకు రూ.500 కోట్లు మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇకపోతే ఈ నేషనల్ హైవే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా వెళ్తుంది. తద్వారా రాజధానికి జనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ జాతీయ రహదారి విస్తరణతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని.. ట్రాఫిక్ తగ్గుతుందని అంటున్నారు. పైగా తెలంగాణకు, మచిలీపట్నం పోర్టుకు ఈ హైవే అనుసంధానం ఏర్పడుతుంది. హైవే విస్తరణతో ఖమ్మం నుంచి గ్రానైట్‌ను మచిలీపట్నం పోర్టుకు తరలించడం, నూజివీడు మామిడి పండ్లను రవాణా సులభతరం అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు