
విడాకులు పొందిన దంపతులలో భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా భర్త ఆమెకు భరణం చెల్లించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు జడ్జి స్పష్టం చేశారు. భార్య గౌరవప్రదమైన జీవనం కొరకు నెలకు 15,000 రూపాయలను భరణం కింద చెలించాలంటూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన భర్త పిటిషన్ ను ధర్మాసనం కొట్టేయడం గమనార్హం. భార్య ఉద్యోగం చేస్తూ నెలకు 25 వేల రూపాయలు సంపాదిస్తున్న నేపథ్యంలో భరణం చెల్లించాల్సిన అవసరం లేదనే భర్త వాదనను తోసిపుచ్చింది.
నెలకు లక్ష సంపాదిస్తున్న భర్తకు ఇతర ఆర్థికపరమైన బాధ్యతలేవి లేవని గుర్తించిన ధర్మాసనం భార్యకు అనుకూలమైన నిర్ణయాన్ని వెలువరించడం గమనార్హం. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. భర్తతో ఉన్న సమయంలో భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను కొనసాగించిందో విడాకులు తీసుకునే వరకు అలాంటి జీవనాన్ని కొనసాగించే హక్కు ఉందని తేల్చి చెప్పింది.
అందువల్ల భార్య సంపాదించినా భర్త భరణం చెల్లించాలని కోర్టు పేర్కొంది. భార్య సంపాదిస్తున్నారనే కారణంతో ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం సరికాదని కోర్టు తెలిపింది. పెళ్లి తర్వాత అలవాటు పడిన జీవనశైలిని కొనసాగించడానికి హక్కులు ఉన్నాయని జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ఈ విషయాలను స్పష్టం చేశారు.
తన భర్త ప్రముఖ కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారని ఆ వ్యక్తి తండ్రి సైతం నెలకు 28 వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని మహిళ పేర్కొన్నారు. ఉద్యోగం వల్ల తానూ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నానని నా ఆదాయం నాకు సరిపోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె వాదనలతో కోర్టు కామెంట్లు చేసింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు