గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించి జగన్ కు మద్దతుగా నిలిచిన హైదరాబాద్ద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఇదే రూట్ లో కి వచ్చారు .. ఇక ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలను రెచ్చగొట్టే పనిలో పడ్డారు . భారత పార్లమెంట్లో వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కర్నూల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు .. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్‌ బిల్లు విషయంలో పార్లమెంట్లో బిజెపికి సపోర్ట్ చేసి ముస్లింలను దగా చేశారని అసదుద్దీన్ ఓవైసీ వారిపై మండిపడ్డారు .. అలాగే వక్ఫ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిర్వహించిన ఈ సభలో మాట్లాడిన ఆయన .. ప్రధానంగా టిడిపి , జనసేన తీరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .. వక్ప్‌ బిల్లుకు మద్దతు ఇచ్చిన టిడిపిని ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు . అలాగే ఇంకా టీడీపీలోనే ఉన్న ముస్లింలు బయటకు రావాలని ఓవైసీ పిలుపునిచ్చారు .


అలాగే వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిన వైసీపీ కి ఓవైసీ సపోర్ట్ చేశారు .. అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చిన టిడిపి జనసేనకు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు .. అలాగే వక్ఫ్‌ అమలు కోసం ముస్లిములు తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు దేశంలో ముస్లింలను బిజెపి టార్గెట్ చేస్తుందని ఉగ్ర‌వాదుల‌ పేరుతో సాధారణ ప్రజలను వేధిస్తుందని ఓవైసి తీవ్ర విమర్శలు చేశారు .. అలాగే ఆర్ఎస్ఎస్ దేశంలో దర్గాలు , మసీదులను టార్గెట్ చేసింది అన్నారు .. ఫహల్గం దాడికి కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదని కూడా మోదీని ఓవైసీ ప్రశ్నించారు ..  అయితే ఓవైసి ఈ వ్యాఖ్యలు వెనక వెనక చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత విభేదాలు కక్ష కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .. ఓవైసి రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి మతాలతో విద్వేషాలు రెచ్చగొడతానని చెప్పి కెసిఆర్ నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ..


ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నైనా సరే తన గుప్పిట్లో పెట్టుకుని తన కావలసిన పనులు చేయించుకుంటున్నాడు .. అయితే ఓవైసీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన పప్పులు ఉడకనవి కేవలం ఇద్దరి దగ్గర మాత్రమే ఒకటి చంద్రబాబు, రెండు కిరణ్ కుమార్ రెడ్డి .. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీని అరెస్ట్ చేపించి జైల్లో పడేశాడు . వీటన్నిటికంటే ముందు 1990లోనే చంద్రబాబు ఓవైసీని పాత బస్తి గొడవల సమయంలో అరెస్టు చేయించి జైల్లో పడేసి చితకబాదారు .. ఇక ఆప్పటి నుంచి ఓవైసీ చంద్రబాబును ఎలా అయినా దెబ్బ కొట్టాలని ఎన్నో కుట్రలు చేయడాలు మొదలుపెట్టాడు .. అలానే రాష్ట్ర విభ‌జన సమయంలో ముందుగా సమైక్యాంధ్ర అన్న ఓవైసీ తర్వాత చంద్రబాబు ఇచ్చిన లేఖతో జై తెలంగాణ అంటూ  తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు .. అలా తెలంగాణ విడిపోయాక హైదరాబాదును తన అడ్డాగా చేసుకుని మత రాజకీయాలు చేస్తూ కెసిఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు తన కావాల్సిన పనులు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు .. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వాక్ఫ్‌ బోర్డ్ ను రద్దు చేయడంతోో .. దాని మీద రాజకీయం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గెలిపించే పన్నాగం పన్నుతున్నాడు .. అందులో భాగంగానే కర్నూల్లో జరిగిన మీటింగ్ లో ఓవైసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ప్రధాన కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: