మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసిన కుట్రల పైన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుష్ప చిత్రంలోని రప్పా రప్పా  డైలాగులు చెప్పడంతో వైసిపి శ్రేణులను అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం అంటూ ఫైర్ అవుతున్నారు.  వచ్చేవారిని అడ్డుకోవడం, వచ్చిన వారిపైన అక్రమ కేసులు పెట్టడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నారని తన పర్యటనలో ఇదే ఎక్కువగా జరుగుతోందంటూ ఫైర్ అయ్యారు.


సినిమా డైలాగులు పెడితే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఆ డైలాగులు నచ్చకపోతే అసలు సెన్సార్ బోర్డు కు వెళ్లి మరి తీసేయించండి.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలలో మరి ఇంకా దారుణమైన డైలాగులు ఉంటున్నాయి.. మరి వారి సినిమాలలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ ఫైరయ్యారు. అంత ఇబ్బందికరంగా ఉంటే ఆ డైలాగులు వెళ్లి తీసేయించండి అంటూ ఫైర్ అయ్యారు. అంత మాత్రం దానికి సినిమాలు తీయడం ఎందుకు ?ఆపేసేయండి ఏదైనా సినిమా డైలాగులు, పాటలు బాగుంటే అవి ఆదరణ పొందుతాయి అంటూ తెలిపారు.


ఎవరైనా హిట్ అయిన సినిమా పాట పాడితే తప్పు, అలాగే డైలాగ్ చెప్పినా కూడా తప్పే అంటే ఎలా అంటూ హెచ్చరించారు. జెడ్ ప్లస్ కేటగిరి ఉన్నా కూడా తనకు భద్రత ఇవ్వకుండా చేస్తున్నారని..  తాను పర్యటనలకు వెళుతుంటే చంద్రబాబు చేస్తున్న ఆర్భాటం అంతా కాదు ప్రజలు వస్తువు ఉంటే వారిని అడ్డుకోవడం లాటి ఛార్జ్ చేయడం వంటివి చేస్తున్నారు. తాను నడుస్తూ వాళ్ళతో ఉంటే వేలాది మంది పోలీసులు పెడుతూ ఉన్నారు.. పోలీసులను నా భద్రత కోసం కాదు వచ్చే వారిని అడ్డుకోవడమే టార్గెట్ అన్నట్లుగా చేస్తున్నారంటూ ఫైర్. ఇంతటి దుర్మార్గమైన పాలన చంద్రబాబు చేస్తున్నారంటూ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: