
ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. వివాద రహితుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆయనే కిమిడి కళా వెంకట్రావు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన కళా వెంకట్రావు గత ఎన్నికలలో వైసిపి కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై విజయం సాధించారు. కళా వెంకట్రావు ఎక్కడ సంతృప్తితో లేరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తనకు రావాల్సినంత గుర్తింపు లేదని కూడా ఆయన బాధపడుతున్నారట. వాస్తవానికి ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తన సొంత నియోజకవర్గ ఎచ్చర్ల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ సీటు బిజెపికి కేటాయించడంతో చివర్లో ఆయనకు ఇష్టం లేకపోయినా చీపురుపల్లి నుంచి పోటీ చేసి అయిష్టంగా కూటమి ప్రభంజనంలో విజయం సాధించారు.
అయితే చీపురుపల్లిలో కళాకు రాజకీయం చేయడం చాలా కష్టంగా ఉంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బలంగా ఉన్నారు. ఆయన మనసు అంతా ఎచ్చర్ల మీదే ఉందని కిమిడి అనుచరులు చెబుతున్నారు. ఎచ్చెర్ల - రాజాం నియోజకవర్గాలు కిమిడి రాజకీయాలకు కొట్టినపిండి. ఇప్పుడు కళాకు అటు చీపురుపల్లిలో పట్టు చిక్కడం లేదు. ఎచ్చెర్ల - రాజంలోను హవా తగ్గుతుంది .ఇటు సీనియర్ నేతగా ఉన్న మంత్రి పదవి లేదు. పార్టీలోనూ .. ప్రభుత్వంలోనూ ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న చీపురుపల్లిలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నాను అన్న భాదన ఆయనలో ఉందట. తర్వాత అయినా మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందన్న ఆశలు లేవు. ఇక వచ్చే ఎన్నికల తర్వాత రిటైర్మెంట్ జాబితాలో కిమిడి పేరు వినిపిస్తోంది. అందుకే కిమిడి చాలా సైలెంట్ గా ఉంటూ రాజకీయం చేయటమే తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు