గడిచిన కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంగారుపాళ్యంకు వెళ్లిన సంగతి తెలిసిందే.. చిత్తూరు మామిడికాయ, తోతాపురి మామిడి అన్నటువంటివి ధర రూ .2 రూపాయలకు రూ .3 రూపాయలకి మాత్రమే కొంటామంటూ అక్కడ ఉంటే గుజ్జు ఫ్యాక్టరీలు అనడం.. రైతులకు గిట్టుబాటు  ధర లేక కాలువల్లో పారబోశారు..అయితే ఇంతకుముందు 20 నుంచి 25 రూపాయలు 30 రూపాయల వరకు లాస్ట్ ఇయర్ కొని ఇప్పుడు రూ .2 రూపాయలకు ఏంటి అనడం అంటూ జగన్ అక్కడికి వెళ్తానని చెప్పగా.. దానిమీద సీఎం చంద్రబాబు స్పందించి రూ.8 రూపాయలకి కొనండి అని చెప్పడం.. ఆ తర్వాత నాలుగు రూపాయలు మేము కూడా ఇస్తామని  సీఎం చంద్రబాబు మొత్తం మీద 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించారు.



కానీ రైతుల దగ్గర నుంచి కేవలం రూ .8 రూపాయలకే ఫ్యాక్టరీ వాళ్ళు కొనడంతో అది కూడా పూర్తిగా కొనకపోవడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తానని చెప్పిన తర్వాత ఇదంతా జరిగింది... లేకపోతే అంతకుముందు కేవలం రూ .2 రూపాయలకే కొనేవారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వెళ్తానని చెప్పడంతో అప్పుడు రెండు రూపాయల నుంచి నాలుగు నుంచి 8 రూపాయలు అన్నట్లుగా పెరిగింది. ఆరోజున దానిమీద పెద్ద ఇష్యూ కూడా జరిగింది. అయితే ఇప్పుడు అదే రోజున జగన్ అక్కడికి వెళుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అర్జెంటుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లి మరి.. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మరి మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు వాటి మీద కీలకమైన అడుగు పడినట్లు తెలుస్తోంది.1490 రూపాయలు క్వింటాకు ప్రకటించింది కేంద్రం. 50%50  నిష్పత్తిలో కేంద్రం కొందామంది.. ఆంధ్రప్రదేశ్ సగం పెట్టుకోండి, మనం సగం పెట్టుకుందామంటూ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నేరుగా రైతుల ఖాతాలోని ఈ డబ్బులను వేసేటట్టు ప్లాన్ చేసింది. దీంతో ఇది అచ్చెన్నాయుడు చేసిన పోరాటం ద్వారా సాధించిందని టిడిపి పార్టీ.. కానీ జగన్ పోరాటం వల్ల సాధించారన్నటువంటిది వైసీపీ నేతలు  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: