జయ సూర్య అనే ప్రయాణికుడు కూడా గాయాలతో బయటపడ్డాడు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద బస్సులో ఎక్కిన ఆయనకు రొండు కాళ్లకు ఫ్రాక్చర్లు అయ్యాయి. “పొగతో శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది… కొందరు మంటల్లో చిక్కుకుని అరుస్తూ బయటికి దూకారు. నేనూ కిటికీ పగలగొట్టి బయటికి వచ్చా” అని ఆయన తడబడి చెప్పారు. అయితే, అందరికీ అదృష్టం కలిసిరాలేదు. బాపట్ల జిల్లా పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాదుకు బంధువులను కలిసేందుకు వచ్చిన ఆమె తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదం బారిన పడింది.సూరారం ప్రశాంత్ అనే మరో ప్రయాణికుడి ఫోన్ రింగ్ అవుతున్నా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గత 15 సంవత్సరాలుగా అదే ట్రావెల్స్ ద్వారా ప్రయాణించే ప్రశాంత్, సూరారం ప్రాంతంలో హాట్‌చిప్స్ వ్యాపారం చేస్తారు.
మృత్యుంజయుల జాబితాలో ఉన్న వారు: ఎం. సత్యనారాయణ (27), జయ సూర్య (24), అండోజ్ నవీన్ కుమార్ (26), సరస్వతి హారిక (30), నేలకూతి రమేష్ (36), శ్రీలక్ష్మి, జస్విత (8), అభిరా (1.8), కాపర్ అశోక్ (27), ముసాలూరి శ్రీ హర్ష (25), పునుపట్టి కీర్తి (28), వేణుగోపాల్ రెడ్డి (24), ఎం.జి. రామారెడ్డి, ఘంటసాల సుబ్రహ్మణ్యం, అశ్విన్ రెడ్డి, ఆకాష్, జయంత్ కుశ్వాల్, పంకజ్ ప్రజాపతి, గుణసాయి, శివ, గ్లోరియా ఎల్సా సామ్. మంటలు చెలరేగిన బస్సులో నిద్రలో ఉన్న వారిలో చాలా మందికి బయటపడే అవకాశం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. పొగతో కమ్ముకున్న వాతావరణంలో కిటికీలు పగలగొట్టి బతికిన వారు నిజంగా మృత్యుంజయులుగా నిలిచారు. రక్షణ బృందాలు వీరిని సమయానికి బయటికి తీయడం వల్ల మరింత ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదం మళ్లీ ఒకసారి రోడ్డు భద్రత, రాత్రివేళ ప్రయాణాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ప్రాణాలను గాలికి వదిలేసిన ఈ ఘటనలో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి