త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి అమృత ను ‘బీఎల్ఎఫ్’ నుండి తాము బరిలోకి దింపు తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ప్రకటించారు. అమృతకు అన్ని పార్టీలు మద్దతివ్వాలనికోరారు. మిర్యాలగూడ పరువు హత్య నిందితులందరినీ పట్టుకొచ్చి మీడియా ముందు ప్రదర్శనకు పెట్టి పోలీసులు కాస్త ఊపిరి పీల్చు కున్నారో లేదో అక్కడ ఆ అభాగిని చుట్టూ అవకాశవాద రాజకీయం ఊపిరిపొసుకుంటుంది.
భర్తను పోగొట్టుకుని, వేదనాభరిత స్థితిలో వున్న అభాగిని ‘అమృత’ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయం అలముకుంది. ‘అమృత’ కు బాసట పేరుతో మిర్యాలగూడలో సానుభూతి ఆట మొదలైంది. కేసుతో ప్రమేయం వున్న లోకల్ కాంగ్రెస్ లీడర్ కరీంని పార్టీ నుంచి తప్పించేశాం అంటూ మంగళవారం పరామర్శకొచ్చిన జానారెడ్డి ప్రకటించారు. తనలో ఆకృతి సంత రించుకుంటున్న తన పతి ప్రతిరూపాన్ని చూడాలనుకొంటున్న ఆమె చుట్టూ అవాంచనీయ కాలనాగులాంటి రాజకీయాలకు పాదులేశారు
బుధవారం కూడా ఆమె మీద పొలిటికల్ తాకిడి కొనసాగింది. బహుజన ఫ్రంట్ నేత, సామాజిక శాస్త్రవేత్త అని తనకు తాను చెప్పుకునే కంచె ఐలయ్య, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో పాటు మరికొంతమంది నాయకులు ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పారు. అక్కడి తో ఆగకుండా, “ఈమెను కుల వ్యవస్థ విధ్వంస దిక్సూచిలా చూడాలి. ఒక దళితుడ్నికులాంతర వివాహం చేసుకుని ఆమె పడిన కష్టాలకు ఉపశమనం కలిగించాలి. మిర్యాలగూడ నుంచి ఆమెను ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపుదాం, ఇందుకోసం అన్ని పార్టీలూ అభ్యర్థుల్ని పెట్టకుండా ఏకగ్రీవానికి తోడ్పడాలి” అంటూ పిలుపునిచ్చారు కంచె ఐలయ్య.
ఈ ప్రతిపాదన మీద ఇప్పటికే రకరకాల విమర్శనాత్మక వ్యాఖ్యలు పడిపోతున్నాయి. మంగళవారం నాడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రోఫెసర్ కంచ అయిలయ్యతో కలిసి తమ్మినేవి వీరభద్రం ప్రణయ్ కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సీపీఎం అభ్యర్థులు పలుమార్లు విజయం సాధించారు. అయితే మిర్యాలగూడలో ప్రణయ్ హత్య చోటు చేసుకొన్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ‘బీఎల్ఎఫ్ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి’ తమ్మినేని వీరభద్రం సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు.
మిర్యాలగూడలో తమది బలమైన పార్టీ, అయినా అమృతను బీఎల్ఎఫ్ తరపున అసెంబ్లీ బరిలోకి దింపుతామని తాము ప్రతిపాదిస్తు న్నట్టు అన్ని రాజకీయ పార్టీలు అమృతకు మద్దతుగా నిలవాలని తమ్మినేని వీరభద్రం కోరారు. నాలుగు రోజుల క్రితం అమృత భర్త ప్రణయ్, జ్యోతి ఆసుపత్రి ఆవరణలో అత్యంత దారుణంగా హత్య చేశారు. కులాంతర వివాహం చేసుకొన్నందుకు గాను అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాడు. ఎన్నికలు వస్తున్నందున మిర్యాల గూడ నుండి అమృతను బరిలోకి దింపాలని ప్రతిపాదిస్తున్నట్టు తమ్మినేని చెప్పారు. ఈ విషయమై ఇతర రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి. తద్వారా అమృతపై జన సానుభూతిని సొమ్ముచేసుకొని ఒక సీటైనా దక్కించుకోవాలని సిపిఎం బావిస్తుండవచ్చు అంటూ నెట్టంతా సెటైర్లు పడిపోతున్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృతను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ప్రతిపాదించారు. మంగళవారం మిర్యాలగూడ లో ప్రణయ్ నివాసంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లి దండ్రులను పరామర్శించారు. కుల దురహంకారానికి ప్రణయ్ బలయ్యాడని, ఈ హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అమృతను చట్టసభలకు పంపాలన్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ తరఫున మిర్యాలగూడ శాసనసభ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే సీఎం కనీసం ప్రకటన కూడా చేయలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించడానికి రాలేదని ఆరోపించారు. ఈ హత్యలో ఆరోపణలెదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు
కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతరపార్టీ నేతలు మజీదుల్లాఖాన్, జాన్‌వెస్లీ, తదితరులు ఉన్నారు. మారుతీరావును ఎన్కౌంటర్ చేయా లని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఢిల్లీలో డిమాండ్ చేశారు.