2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున గెలిచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతకు కేంద్ర దర్యాప్తు సంఘం సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులకు ఎగనామం పెట్టి మోసం చేసిన కేసులో ఎంపీ కొత్తపల్లి గీత తో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావు కి సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసి ఈనెల 24వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.
ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే నకిలీ డాక్యుమెంట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసి రూ.25 కోట్లు స్వాహా చేశారన్న అభియోగాలతో తతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మోసం, వంచన, తప్పుడు పత్రాలతో బుద్ధిపూర్వకంగా పక్కదారి పట్టించడం తదితర ఆరోపణలతో వీరిపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ కేసులో వారం రోజులు అయితే కొత్తపల్లి గీతకు ఆమె రాజకీయ జీవితానికి తీరని మచ్చ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.