మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు చేరుకుంది వెస్టిండీస్ జట్టు. కరోనా వల్ల కొంత కాలంగా స్థంబించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ తో పున :ప్రారంభం కానుంది. ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో జరునుంది. మ్యాచ్ లను వీక్షించేందుకు మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. రెండు చార్టెడ్ ఫ్లయిట్ లలో విండీస్ జట్టు సోమవారం సాయంత్రం ఇంగ్లాండ్ కు చేరుకుంది. బయల్దేరే ముందు విండీస్ బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చింది. ఈరోజు ఉదయం విండీస్ జట్టు మాంచెస్టర్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. అంతకంటే ముందు ఆటగాళ్లకు మరో సారి కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.  

జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు జరుగనుంది. ఇక ఈ టెస్టు సిరీస్ కు ఏకంగా 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది. ఈసిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), బ్లాక్ వుడ్ ,రోస్టన్ చేస్ ,బ్రూక్స్ ,క్యాంప్ బెల్,కార్న్ వాల్ , షేన్ డౌరిచ్ ,హోప్ ,అల్జారీ జోసెఫ్ , కీమర్ రోచ్, క్రైగ్ బ్రాత్ వైట్,  చేమర్ హోల్డర్ , రేమాన్ రీఫైర్ , బొన్నెర్

మరింత సమాచారం తెలుసుకోండి: