క్రికెట్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ 14 రానే వచ్చింది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ హంగామా మొదలు కానుంది. బరిలో ఉన్న జట్లు అన్నీ కూడా టైటిల్ పై కన్నెశాయి. ఇంత వరకు ఒక్క సారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబి, డిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో ఎప్పుడు హాట్ ఫేవరెట్ గా ఉండే జట్లు..చెన్నై సూపర్ కింగ్స్, మొంబై ఇండియన్స్ జట్లు ఈసారి కూడా హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతున్నాయి. ఇక హైదరబాద్, కోల్ కత్తా, రాజస్థాన్ వంటి జట్లు కూడా మంచి ప్లేయర్స్ తో బరిలోకి దిగుతున్నాయి.

అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో కూడా హాట్ ఫేవరెట్ గా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరో సారి టైటిల్ పై కన్నెసింది. రోహిత్ కెప్టెన్సీ లో ముంబై ఎంతో బలమైన జట్టుగా నిలుస్తూ మిగతా జట్లకు తీవ్ర పోటీగా మారింది. జట్టు మొత్తం హార్డ్ హిట్టర్లతో ఎంతో దుర్భేద్యమైన లైనప్ తో ఉంది. రోహిత్, డి కాక్, పొలార్డ్, హార్దిక్, కృనాల్, సూర్య తానేమిటో గుర్తు చేశాడు సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ మిల్నే, నాథన్‌ కూల్టర్‌నైల్, జిమ్మీ నీషమ్, మార్కో జాన్సన్‌, బుమ్రా వంటి బౌలర్స్ తో బౌలింగ్ విభాగం లోనూ పటిష్టంగానే ఉంది. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు రాహుల్ చహర్, యుధ్‌వీర్‌ చరక్, అర్జున్‌ టెండూల్కర్‌  వంటి ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.

ఇక గత కొన్నేళ్లుగా ఒకటి, రెండు స్థానాలు మినహా... లేదంటే ఆటగాళ్లు గాయపడితే తప్ప ముంబై ఇండియన్స్‌ తుది జట్టులో ఎప్పుడూ మార్పులు జరగలేదు. అసలు అలాంటి అవసరం కూడా కనిపించలేదు. అంత పక్కాగా ఆ టీమ్‌ కూర్పు, వ్యూహాలు ఉన్నాయి. మరి కొత్త ఆటగాళ్ల చేరికతో తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.. ముఖ్యంగా సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్ పై అందరి దృష్టి నెలకొంది. ఇక ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీ లో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే ముంబై ఇండియన్స్ కు రోహిత్ కెప్టెన్సీ ఎంత బలమో అర్థమౌతుంది. మరి ఈ సీజన్ లోనూ రోహిత్ కెప్టెన్ గా తనదైన ముద్ర వేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: