మనిషికి పట్టుదల ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు. అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది.. అనే పాటను ఆ కవి ఊరికనే రాయలేదు. మనిషి యొక్క గొప్పతనాన్ని టాలెంట్ ను తెలుపుతూ రాశాడు. పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా అనుకున్నది సాధించవచ్చని  నిరూపించింది ఈ బాలిక. ఆమె 14 సంవత్సరాల వయసు . అంత చిన్న వయసులోనే  ప్రపంచ ప్రఖ్యాతి గావించింది. ఒలంపిక్స్ పోటీల్లో  డ్రైవింగ్ లో పసిడి పతకం గెలిచి  క్రీడా ప్రపంచం మొత్తాన్ని  తనవైపు తిప్పుకుంది. ఎవరు ఆ బాలిక అనుకుంటున్నారా..? చైనా  దేశంలోని  గ్వాడంగు ప్రావిన్స్ లోని ఒక చిన్న మారుమూల గ్రామం.  ఆ బాలిక పేరు క్వాన్ హ్యాంగిఛన్.. క్వాన్ ది చాలా నిరుపేద కుటుంబం. ఆ కుటుంబంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయి. దీనికి తోడుగా  2017 వ సంవత్సరం లో  ఆమె తల్లికి యాక్సిడెంట్ జరిగి  తీవ్రంగా గాయపడి ఉన్నది.

దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు ఎక్కువ అయ్యాయి. కనీసం వైద్య ఖర్చులకు డబ్బులు లేకుండా అయిపోయింది. ఈ సందర్భంలోనే తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడు కోవాలని క్వాన్ క్రీడలను ఎంచుకుంది. స్కూల్ పిల్లల కొరకు వేసవికాలంలో ఏర్పాటు అయినటువంటి శిక్షణ శిబిరం ద్వారా డ్రైవింగ్ లో ఆమె ఎక్కువగా టాలెంట్ పెంచుకుంది. అలా మొదలైనటువంటి ఆమె ప్రయాణం  చివరికి టోక్యో ఒలంపిక్స్ వరకు తీసుకెళ్లి అక్కడ పసిడి పతకం గెలిచింది. ఇంత సామాన్య కుటుంబం నుంచి వెళ్లి బంగారు పతకం గెలిచే వరకు ఆమె ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆమె  కష్టం  చైనాలో సెలబ్రిటీని చేసింది. చైనా దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి  ఆమెను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చి  భారీగా నజరానాలు ప్రకటించారు. తనకు ఫ్లాట్ లను కూడా బహుమానంగా అందించారు. కానీ వీటిని తిరస్కరించామని క్వాన్  తండ్రి మీడియాకు తెలియ జేశారు. ఆమె తండ్రి బత్తాయి పండ్లు పండిస్తూ ఉంటాడు.

 వ్యవసాయం మీద వచ్చినటువంటి డబ్బుతోనే  తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా పాపులారిటీ పెంచుకున్న టువంటి  క్వాన్ ను చూసేందుకు చైనా దేశంలోని  పలు దిక్కుల నుంచి సందర్శకులు ఆమె గ్రామానికి వస్తున్నారు. అనేక ఇంట ర్వ్యూలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. దీంతో ఆ గ్రామమంతా సందర్శకులతో నిండిపోయి, హడావుడి కనిపిస్తోంది. దీంతో ఆమె తండ్రి మీరు పోస్టు ద్వారా శుభాకాంక్షలు తెలిపితే సరిపోతుందని , కష్టపడి ఇక్కడిదాకా రావాల్సిన అవసరం లేదని, అలా వస్తే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని, మాకు బహుమతులు కూడా అవసరం లేదు అని క్వాన్ తండ్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: