ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే  అటు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా డేవిడ్ వార్నర్ బాగా దగ్గరయ్యాడు.  మొన్నటి వరకు ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కొనసాగిన డేవిడ్ వార్నర్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం ఢిల్లీ కాపిటల్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శనచేసి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


 అయితే ఇక ఇప్పుడు సన్రైజర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వచ్చినప్పటికీ కూడా డేవిడ్ వార్నర్ ఆటతీరును మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రతి మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు డేవిడ్ వార్నర్. ఇటీవల హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. మొదట్లో ఎంతో నెమ్మదిగా ఆడిన వార్నర్ తర్వాత గేరు మార్చి బౌండరీల వర్షం కురిపించాడూ. 52 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో భాగంగా వార్నర్ ఆడిన కొన్ని షాట్స్ ఎంతో హైలెట్ గా మారిపోయాయి.


 మరీ ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఓవర్లో డేవిడ్ వార్నర్ ఆడిన షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి. ఢిల్లీ ఎన్నికల సమయంలో భువనేశ్వర్ కుమార్ తొలిబంతి వేయడానికి సిద్ధమయ్యాడూ. అప్పుడు స్ట్రైక్ లో ఉన్న డేవిడ్ వార్నర్ స్వీప్ కట్ ఆడేందుకు  రెడీ అయ్యాడు.  అయితే ముందుగానే పసిగట్టిన భువనేశ్వర్ కుమార్ వైడ్ యార్కర్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే వార్నర్ క్షణాల్లో తన ప్లాన్ మార్చుకుని రైట్ హ్యాండ్ ఆడినట్లుగా థర్డ్ మాన్ దిశగా బౌండరీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. కేవలం క్షణాలు కాల వ్యవధిలో ఇలా పొజిషన్ మార్చుకుని బౌండరీ కొట్టడం కేవలం డేవిడ్ వార్నర్ కి మాత్రమే సాధ్యమైంది అని అంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: