సాధారణంగా టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే. ఇక మిగతా ఆటగాళ్లు ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ కూడా ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఆటతీరుని అందరూ గమనిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ తర్వాత ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్య కుమార్ యాదవ్ మాత్రమే అని చెప్పాలి. అతను జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా ఎదిగాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియాలో నాలుగవ స్థానంలో నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.


 అసమాన్యమైన తన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే ఇక అతని మాట తీరుపై ఏకంగా సహచరులు మాత్రమే కాదు ప్రత్యర్థులు సైతం ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఏకంగా మైదానం నలువైపులా సూర్య కుమార్ యాదవ్ ఎంతో అలవోకగా షాట్లు ఆడుతున్న తీరుకూ ప్రేక్షకులు అందరూ కూడా మంత్రముగ్దులు అవుతున్నారు అని చెప్పాలి. అందుకే అతనికి మిస్టర్ 360 ప్లేయర్ అనే ఒక బిరుదును కూడా ఇచ్చేశారు.


 ఇకపోతే టి20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన తీరుపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య కుమార్ యాదవ్ లాంటి వారికి సరైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత టి20 ఫార్మాట్లో విప్లవాత్మకమైన మార్పులకు సూర్య కుమార్ యాదవ్ ప్రతినిధిగా ఉంటాడు అంటూ సంజయ్ బంగారు తెలిపాడు. వికెట్లకు నలువైపులా కూడా షాట్లు కొట్టడం అద్భుతం అంటూ తెలిపాడు. ఇక భారత్ కూడా ఇంగ్లాండ్ లాగానే 9వ స్థానం వరకు ఆల్రౌండర్లతో నింపివేయాలి అంటూ సంజయ్ బంగర్ సూచించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: