2023 ఐపీఎల్ సంబంధించి బిసిసిఐ అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటినుంచి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైన బీసీసీఐ ఇప్పటికే అన్ని జట్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా జట్లు వదిలేసుకోబోయే ఆటగాళ్ల వివరాలను ఇక తమతో అంటిపెట్టుకొనే ఆటగాళ్ల వివరాలను వెంటనే అందించాలి అంటూ బీసీసీఐ కోరింది.


 బీసీసీఐ ఆదేశాల మేరకు అన్ని జట్లు కూడా తాము వదిలేసుకోబోయే ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పలువురు కీలక ఆటగాళ్ళను తమతోనే అంటిపెట్టుకుంది అన్నది తెలుస్తుంది. అయితే గత ఏడాది పెద్దగా ఆశించినంత ప్రదర్శన చేయలేక.. నిరాశపరిచిన దేవదత్ పడిక్కల్ ను మరోసారి రాజస్థాన్ రాయల్స్ రిటైల్ చేసుకుంది అని తెలుస్తుంది. 2020 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అద్భుతంగా ఆడిన పడిక్కాల్ ను ఎంతో నమ్మకంతో మెగా వేలంలో 7.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్..



 అయితే గత ఏడాది సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున దేవదత్ పడిక్కాల్ ఏమాత్రం రాణించలేకపోయాడు అని చెప్పాలి.  అయినప్పటికీ అతని మాత్రం రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ అతన్ని వదిలేయకపోవడానికి కారణం కోచ్ కుమార సంగకర అన్నది తెలుస్తుంది. ఆయన ఇచ్చిన సలహాల మేరకే దేవదాత్ పడిక్కాల్ కూ మరో ఛాన్స్ ఇచ్చిందట రాజస్థాన్ రాయల్స్. సంజు సాంసంగ్, యశస్వి జైస్వాల్, హిట్ మేయర్, బట్లర్, పరాగ్, అశ్విన్, చాహాల్ లను కూడా రిటైన్ చేసుకుని రాజస్థాన్ రాయల్స్. మరి వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రదర్శన చేయబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: