
ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల సెంచరీలతో చెలరేగిపోతున్న తీరు అటు ఈ వార్తలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇటీవలే ఉత్తరప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాధి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే మ్యాచ్ లో అజేయమైన డబుల్ సెంచరీ తో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక ఇటీవల అస్సాంతో జరిగిన మ్యాచ్లో మరో భారీ శతకం బాది ఇక రోజుల వ్యవధిలోనే మరో విధ్వంసం సృష్టించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచేసాడు.
అస్సాంతో జరిగిన మ్యాచ్లో 126 బంతులను ఎదుర్కొన్న రుతురాజు గైక్వాడ్ 18 ఫోర్లు 6 సిక్సర్లు సహాయంతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే 168 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ఈ శతకంతో రుతురాజు గైక్వాడ్ ప్రస్తుత టోర్నీలో నాలుగు మ్యాచ్లలో మూడు శతకాలు చేసి 552 పరుగులతో తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర జట్టు నిర్ణయిత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కాగా రుతురాజు గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.