ప్రస్తుతం ఫిఫా వరల్డ్ లో భాగంగా స్టార్ ప్లేయర్ గా సాగుతున్న లియోనల్ మెస్సి కెప్టెన్సీ వహిస్తున్న అర్జెంటీనా జట్టు ఫైనల్ కూ వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లియోనల్ మెస్సికి ఇదే చివరి వరల్డ్ కప్ అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఇక ఈసారి అర్జెంటీనాగా వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని ఎంతోమంది ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు  అని చెప్పాలి. అయితే ఇటీవల అర్జెంటీనా ఫైనల్ చేరిన సమయంలో మెస్సి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 అర్జెంటినా జట్టు ఫైనల్ చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడి.. వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగిస్తా అంటూ లియోనల్ మెస్సి వ్యాఖ్యానించాడు. ఎందుకంటే వచ్చే వరల్డ్ కప్ జరగడానికి చాలా సంవత్సరాలు ఉంది. అందులో ఆడే సామర్థ్యం నాకు ఉంటుందని నమ్మకం లేదు. ఇక ఈ వరల్డ్ కప్ లా ముగిస్తామని ఆశ అసలు లేదు. అందుకే ఇక ఈ ఫిఫా కప్పు ఉత్తమం అంటూ మెస్సి పేర్కొన్నాడు. ఇక మెస్సి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో లేదో లియోనల్ మెస్సి ఇక వరల్డ్ కప్ ముగిసిన వెంటనే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అనే చర్చ మొదలైంది.



 ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఇక డిసెంబర్ 18వ తేదీన జరగబోయే ఫైనల్ మ్యాచ్ తర్వాత మెస్సి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నదే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత కొన్నాళ్లపాటు ఫుట్బాల్ ఆట కొనసాగి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొంతమంది అనుకుంటుంటే.. కొంతమంది ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే మెస్సి రిటైర్మెంట్ ప్రకటించడం  ఖాయమంటూ అంచనా వేస్తున్నారు. దీంతో మెస్సి నిర్ణయం ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: