ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఈక్రమంలోనే ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలబడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతున్న భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో అడుగు పెట్టాలి అంటే ఆస్ట్రేలియా పై తప్పక విజయం సాధించాల్సి ఉంది.


 అయితే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం అసాధ్యం అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక భారత జట్టును ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఆస్ట్రేలియా జట్టు. ఈ క్రమంలోనే భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక ఆటగాడితో ప్రాక్టీస్ చేస్తుంది ఆస్ట్రేలియా.  భారత యువ బౌలర్ అయిన మహేష్ పిదియాతో బౌలింగ్ తో నెట్ ప్రాక్టీస్ చేస్తుంది అన్న విషయాన్ని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇక ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా స్పందించాడు. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు వర్మ మ్యాచ్ లు ఆడక పోవడం పై స్పందించాడు. నిజంగా ఇలా వార్మప్ మ్యాచ్లు ఆస్ట్రేలియా ఆడక పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ పిచ్ లపై వార్మప్ మ్యాచులు ఆడితేనే ఇక పరిస్థితులను అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇక భారత్ ఆస్ట్రేలియా జట్టు మొదటిసారి వార్మప్ మ్యాచ్లు లేకుండానే కేవలం ప్రాక్టీస్ తోనే నేరుగా అధికారిక మ్యాచ్ లో బరిలోకి దిగెందుకు సిద్ధమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: