
అయితే ఇక ఇలా వేధింపుల నేపథ్యం లో ఎంతో మంది మహిళలు భయపడి పోతున్నారు అని చెప్పాలి. అయితే కొంత మంది మహిళలు మాత్రం తమను ఎవరైనా వేధిస్తున్నారు అంటే చాలు వారికి సరైన బుద్ధి చెప్పడం చేస్తూ ఉన్నారు. తద్వారా ఆడపిల్ల అంటే అబలకాదు సబల అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన యువకుడికి మహిళా సరైన బుద్ధి చెప్పింది. చివరికి సదరు యువకుడు ఆసుపత్రి పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఒక మహిళ పొలానికి వెళుతూ ఉండగా యువకుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమం లోనే నిందితుడు మహిళను బలవంతం గా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన సదరు మహిళ యువకుడి పెదవిని కొరికి వేరు చేసేసింది. దీంతో నొప్పితో విలవిల లాడిపోయిన యువకుడు ఆమెను వదిలేశాడు. దీంతో మహిళా గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి వచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.