ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న టీమ్ ఇండియా టెస్ట్ బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా టీమ్ ఇండియానే విజయం సాధించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాకు గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా జట్టు రెండు మ్యాచ్ లలో కూడా ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 ఇక ఇరు జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ 1వ తేదీన జరగబోతుంది. అయితే ఒకవేళ టీమిండియా రెండు మ్యాచ్లలో గెలిచిన జోరునే కొనసాగించి మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించింది అంటే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్నట్లు అవుతుంది. ఒకవేళ అదే జరిగితే అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే మూడో మ్యాచ్లో విజయం కోసం టీమిండియా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. అయితే ఇక మిగిలిన రెండు మ్యాచ్లకు సంబంధించిన టీమిండియా జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న  కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్ బాధ్యతలు  నుంచి తప్పించింది.


ఇక అతనికి జట్టులో ఉంటాడా లేదా అనేదానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇక వైస్ కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్ ని తప్పించిన తర్వాత ఇక ఇప్పుడు ఎవరు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే బాగుంటుంది అనే విషయంపై చర్చ మొదలైంది. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. ప్రస్తుతం భారత్ కి టెస్టుల్లో వైస్ కెప్టెన్ లేడు. మరి తదుపరి వైస్ కెప్టెన్ ఎవరు.. ఎవరైతే కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ గా ఉంటారో.. వారు తప్పకుండా తుది జట్టులో ఓపెనింగ్ చేస్తారు. అది భారత్లో అయిన విదేశాల్లో అయినా సరే. కాబట్టి అలాంటి ఆటగాడు రవీంద్ర జడేజా మాత్రమే అంటూ హార్భజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు టెస్ట్ వైస్ కెప్టెన్సీ తప్పకుండా జడేజాకే ఇవ్వాలి ఇది అతడిని మరింత బాధ్యతాయుతంగా ఆడేలా చేస్తుంది అంటూ చెప్పుకుచ్చాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాక అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: