భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గావాస్కర్ ట్రోఫీని మరోసారి టీమిండియా జట్టు కైవసం చేసుకుంది అని చెప్పాలి. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు..  ఇక ఈ సిరీస్ లో తమ జైత్రయాత్రను మరోసారి కొనసాగించింది అని చెప్పాలి. అయితే చివరి నాలుగో మ్యాచ్ లో అయితే అటు బ్యాట్స్మెన్ లదే హవా నిలిచింది. కానీ మొదటి రెండు మ్యాచ్లలో మాత్రం టీమిండియా గెలిచింది అంటే కేవలం బౌలర్ల కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జట్టులో కీలక స్పిన్నర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ బౌలింగ్ తో మాయ చేసారు.


 ఒకరకంగా చెప్పాలి అంటే అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లతో చెడుగుడు ఆడేశారు అని చెప్పాలి. మొత్తంగా నాలుగు టెస్టుల్లో కలిపి 47 వికెట్లు పడగొట్టింది రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ద్వయం. ఇక వీరిద్దరూ అద్భుతంగా రాణించడం కారణంగానే మొదటి రెండు మ్యాచ్లలో బ్యాటింగ్లో వైఫల్యం ఉన్నప్పటికీ ఎంతో అలవోకగా టీమిండియా విజయం సాధించగలిగింది. అయితే ఇక ఇటీవల జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో కూడా రవీంద్ర జడేజా,  రవిచంద్రన్ అశ్విన్ ద్వయం సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును షేర్ చేసుకున్నారు అని చెప్పాలి.


 ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ప్రముఖ వ్యాఖ్యాత అయినా హర్ష బోగ్లే ఈ స్టార్ స్పిన్ ద్వయాన్ని ఆసక్తికర ప్రశ్నలు అడగగా.. వాళ్ళు కూడా అదే రీతిలో సమాధానాలు చెప్పారు అని చెప్పాలి. ఇక ఈ సంభాషణలో భాగంగా హర్ష భోగ్లే అడిగిన ఒక ప్రశ్నకు జడేజా ఇచ్చిన అదిరిపోయే సమాధానం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. హర్ష భోగ్లే మాట్లాడుతూ అశ్విన్ సైంటిస్టుకు ఎక్కువ బౌలర్కు ఎక్కువ అంటూ అడిగాడు. జడేజా దీనికి సమాధానం ఇస్తూ అశ్విన్ అన్నింటికంటే ఎక్కువ అంటూ చెప్పడంతో హర్ష భోగ్లే తెల్ల ముఖం వేశాడు. ఇక దీనికి వివరణ కూడా ఇచ్చాడు జడేజా. అశ్విన్ కు చాలా మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది. అనునిత్యం క్రికెట్ గురించి మాట్లాడుతుంటాడు. అశ్విన్ కు ప్రపంచంలోనే అన్ని క్రికెట్ జట్లపై అవగాహన ఉంది. ఏ జట్టు ఏ మూలలో ఏ టోర్నమెంట్ జరుగుతుందో కూడా అతనికి తెలుసు. అందుకే అతని బ్రెయిన్ కి సలాం కొడతా.. అందుకే అతను అన్నిటికంటే ఎక్కువ అంటూ జడేజా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: