ఇటీవల ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ గా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరి వరకు గెలుపు కోసం పోరాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తమ ముందు ఉంచిన టార్గెట్ చేదించలేక చివరికి ఓడిపోయింది అని చెప్పాలి.



 అయితే ఇక అటు నిజజీవితంలో అన్నదమ్ముల్లా ఉండే విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని మధ్య మ్యాచ్ అనడంతో ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా వీక్షించారు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయి నిరాశలో ఉన్న విరాట్ కోహ్లీకి ఇటీవలే ఐపీఎల్ మేనేజ్మెంట్  మరో ఊహించని షాప్ ఇచ్చింది అన్నది అర్థమవుతుంది. సాధారణంగా విరాట్ కోహ్లీ  క్రికెట్ రూల్స్ విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇక కోహ్లీ క్రికెట్ రూల్స్ బ్రేక్ చేయడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇటీవలే అతని ప్రవర్తన కారణంగా చివరికి రూల్స్ బ్రేక్ చేసినట్లు అయింది. తద్వారా ఇక జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.



 విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు  ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో కోహ్లీకి  మ్యాచ్ ఫీజులో 10% కోత విధిస్తున్నట్లు ప్రకటించారు ఐపీఎల్ నిర్వహకులు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ శివం దూబే కొట్టిన షాట్ ను బౌండరీ లైన్ వద్ద సిరాజ్ క్యాచ్ అందుకున్న సమయంలో విరాట్ కోహ్లీ దానిని వింతగా సెలబ్రేషన్ చేసుకున్న తీరే ఇక ఇలా నియామవళి ఉల్లంఘనకు కారణమై ఉండవచ్చు అని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. కాగా విరాట్ కోహ్లీ లెవెల్ వన్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఐపిఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: