బ్రహ్మదేవుడి యజ్ఞవేదిక. అందు నిరంతరమూ మూడు అగ్నికుండాల్లో త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. వేదాలు, యజ్ఞాలు ఆకార రూపం దాల్చి, అరవై కోట్ల పదివేల తీర్థాలూ కలిసి గంగా, యమునా సంగమంలో తీర్థాల్ని సేవిస్తాయి. ప్రయాగలో స్నాన మాచరించిన వారు రాజసూయయాగం చేసిన పుణ్యమూ, అశ్వమేథ యాగాలు చేసిన పుణ్యమను పొందుతారు. సత్యవ్రతాన్ని ఆచరించే వారికి కలిగే పుణ్యమూ, చతుర్వేదాలనూ అధ్యయనం చేసిన పుణ్యం లభించడం వల్ల మహోత్తర సుఖాలని పొందుతారని శ్రీ వ్యాసమహర్షి మహా పుణ్యక్షేత్రమైన ప్రయాగ క్షేత్రం గూర్చి వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: