సంగ్రామాల జ్వాల ఇదే.. విశ్వ సైన్యాల స్ఫూర్తి ఇదే.. ధర్మము.. అధర్మము.. ఆది.. అనంతము.. ఇలా  మహాభారతం గురించి మనం ఎన్ని విధాలుగా  మనసులో తలచుకున్నా, మన ముందు మహాభారతం జరుగుతుందేమో అన్న భ్రమలోనే ఉండిపోతాము. ఈ మహా భారతం కథను ఎన్ని సార్లు చదివినా లేదా ఎన్నిసార్లు విన్నా, విన్న ప్రతిసారి లేదా చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాము. అదే ఈ మహాభారతం యొక్క మహా అద్భుతం. అయితే ఇంతటి అద్భుతమైన కథలో మనకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మహాభారతంలోని ద్రోణాచార్యునికి సంబంధించిన ఒక ఇతివృత్తం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు. ద్రోణాచార్యుడు తల్లి ఒక అప్సరస. ఒకానొక సమయంలో  సాయం కాలం భరద్వాజుడు స్నానం చేయడానికి గంగా నది తీరానికి వెళ్ళాడు.. అక్కడ స్నానం చేస్తున్న ఒక అప్సరస అందాన్ని చూసి మంత్రముగ్ధుల్ని అయ్యాడు. ఇక అప్పుడు భరద్వాజుడు అతని శరీరం నుంచి విడుదలైన ఒక శుక్రకణాన్ని ఒక కుండలో ఉంచి, దానిని చీకటిగదిలో భద్రపరుస్తారు. దీని నుంచి ద్రోణాచార్యుడు జన్మించినట్లు మహాభారతంలో చెప్పబడింది.కానీ పెద్దగా ప్రాముఖ్యతను సంతరించుకొనబడలేదు.

2. పాండవుల తండ్రి పాండురాజు చనిపోయేముందు, తన కుమారులు అందరినీ పిలిపించి , వారి తెలివిని మరింత పెంచేందుకు, చనిపోయే ముందు నా శరీరాన్ని మీరు ఐదుగురు ఐదు భాగాలుగా చేసుకుని భుజించాలి అని కోరాడు. చనిపోయిన తరువాత తండ్రి కోరిక మేరకు సహదేవుడు మాత్రమే తన తండ్రి మెదడును మూడు ముక్కలు మాత్రమే తిన్నాడు. ఇక మిగతా వారు ఆ సాహసం చేయలేకపోయారు. అందుకే సహదేవునికి భూత, భవిష్యత్ , వర్తమాన కాలాలకు సంబంధించిన అన్ని విషయాలను పసిగట్టే తెలివి వచ్చింది.

3. అభిమన్యుడి భార్య వత్సల. బలరాముడి కుమార్తె. బలరాముడు తన కుమార్తె వివాహాన్ని దుర్యోధనుడు కుమారుడైన లక్ష్మణ కుమారునితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పటికే అభిమన్యుడు, వత్సల ప్రేమలో ఉండడంతో, ఈ విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు ,లక్ష్మణ కుమారుడిని జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేసేవరకు భయపెట్టి, ఆతర్వాత అభిమన్యుడు, వత్సల పెళ్ళి జరిపించాడు  ఘటోత్కచుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: