స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతుంది. ఇప్ప‌టికే చాలా ఇబ్బందుల్లో జ‌ట్టు కురుక పోయింది. ఇప్ప‌టికే రెండో ద‌శ మ్యాచ్‌ల ముందే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క ఆట‌గాడు బెన్ స్ట్రోక్ దూరం అయ్యాడు. అలాగే మొద‌టి ద‌శ మ్యాచ్ ల స‌మ‌యం లోనే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ కు గాయం అయింది. దీంతో న‌ట‌రాజ‌న్ మొద‌టి ద‌శ మ్యాచ్ ల‌న్నికీ దూరం అయ్యాడు. మ‌ళ్లి ఇప్పుడు అదే న‌ట‌రాజ‌న్ కు క‌రోనా రావ‌డంతో మ‌ళ్లి క‌ష్టాల్లో ప‌డింది. న‌ట‌రాజ‌న్ తో పాటు ఇత‌నికి స‌న్నితంగా ఉన్న ప్రముఖ ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ కూడా ఐసోలేష‌న్ కు వెళ్లాడుతాజాగా సన్‌రైజర్స్ హైద‌రాబాద్ మ‌రో పెద్ద‌ బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్ర‌ముఖ‌ ఆల్‌రౌండర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు దూరం కానున్నాడు. షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్ తండ్రి చ‌నిపోవ‌డంతో స్వదేశం అయిన వెస్ట్ ఇండిస్ కు ప‌య‌న మ‌య్యాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైద‌రాబాద్ జట్టుకు ఇది తెరుకోలేని దెబ్బే అని చెప్పాలి. జ‌ట్టు లో ఉన్న దాదాపు చాలా మంది కీ ప్లేయ‌ర్స్ వ‌ర‌స‌గా జ‌ట్టు కు దూరం అవుతున్నారు. వీరి స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌డం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు పెను స‌వాలే అని చెప్పాలి.ఇదీలా ఉండ‌గా ఈ సీజన్‌లో స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్‌ ఇప్పటివరకు ఎనమిది మ్యాచ్‌‌లు ఆడింది.  అందులో సన్‌రైజర్స్‌ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌‌లో విజయం సాధించింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితు ల‌ల్లో జ‌ట్టు లో ఉన్న కీ ప్లేయర్స్ వ‌రుస‌గా జ‌ట్టు కు దూరం కావాడం దుర‌దృష్టం అనే చెప్పాలి. ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని మిగిలిన మ్యాచ్ గెల‌వ‌డం పెను స‌వాలే అని చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: