ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను ఇండియన్ క్రికెట్ అభిమానులు ఏ స్థాయిలో ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే. దానితో (ఐపీఎల్) పై భారీ మొత్తంలో డబ్బులను వేచించి ప్లేయర్ లను కొనుగోలు చేస్తూ పెద్ద స్థాయిలో ఈ టీం లను ఎంతో మంది మెయింటైన్ చేస్తున్నారు. ఇక (ఐపీఎల్) ను ఇష్టపడే జనాలు ఎక్కువ శాతం ఇందులో భారీ స్కోర్ లు వచ్చి ఆ స్కోర్ లను ఎదుటి టీం ను చేజింగ్ చేస్తూ ఉంటే మరింతగా ఇష్టపడుతూ ఉంటారు. తక్కువ స్కోరు వచ్చిన మ్యాచ్ లపై క్రికెట్ అభిమానులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దానితో ఆటగాళ్లు కూడా తమ జట్టు అత్యధిక స్కోరు ను సాధించే విధంగా బ్యాటింగ్ ను చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటి వరకు (ఐపీఎల్) హిస్టరీలో ఎన్నో 200 పరుగులు దాటిన ఇన్నింగ్స్ లు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు 200 పరుగుల ఇన్నింగ్స్ లను చేసిన టీమ్స్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటివరకు జరిగిన (ఐపిఎల్) సీజన్ లలో అనే కసార్లు చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ ని దక్కించుకుంది. ఇకపోతే ఈ టీం ఇప్పటి వరకు (ఐపీఎల్) హిస్టరీలో 29 సార్లు 200 ప్లస్ పరుగుల స్కోరును సాధించింది. ఇండియాలో చాలా మంది అభిమానులను కలిపి ఉన్న "ఆర్సిబి" జట్టు ఇప్పటి వరకు ఒక్క సారి కూడా (ఐపీఎల్) ట్రోఫీని గెలుపొందకపోయినప్పటికీ చాలా సార్లు మాత్రం 200 ప్లస్ పరుగులను చేసింది. ఈ జట్టు ఇప్పటి వరకు 24 సార్లు 200 ప్లస్ స్కోర్ ను సాధించింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు 23 సార్లు 200 ప్లస్ స్కోర్ ను సాధించగా కేకేఆర్ , పంజాబ్ చెరో 21 సార్లు "ఐపీఎల్" లో 200 ప్లస్ స్కోర్ ను సాధించాయి. ఈ ఐదు జట్లు ఇప్పటి వరకు (ఐపీఎల్) హిస్టరీలో అత్యధిక ఇన్నింగ్స్ లలో 200 ప్లస్ స్కోర్ ను సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl