
నటి శుభంగి మాట్లాడుతూ తమ అన్యోన్య దాంపత్యం విడిపోవడానికి గల కారణాన్ని తెలియజేస్తూ..తాను టెలివిజన్ రంగంలో సక్సెస్ అయ్యాను కాబట్టి తన భర్తని వదిలేసానని చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ అందులో నిజం లేదు.. అతడి తాగుడు వ్యాసనం వల్లే విడిపోవలసి వచ్చిందంటూ తెలియజేసింది. పీయూష్ బానిస అవ్వడం వల్ల అది కుటుంబం మీద తీవ్రమైన ప్రభావాన్ని సైతం చూపించిందట. తమ బంధాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను కానీ పరిస్థితులన్నీ కూడా తమకు అనుకూలించలేదు అతనితో మందు మాన్పించాలని ఎన్నో హాస్పిటల్కు వెళ్లి ప్రయత్నించాను అయినా కూడా తనలో ఎటువంటి మార్పులు రాలేదు. తమ రెండు కుటుంబాలు కూడా పీయూష్ ను మార్చాలని ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని అదే అతడి నాశనానికి కారణమయ్యిందని తెలిపింది
విడాకులు ఒక్కరోజులో తీసుకొని నిర్ణయం అనుకుంటున్నారెమో.. కాదు 2018 19 సమయంలోనే విడిపోవాలనుకున్నాము చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్న విడాకులు అయిన తర్వాత కూడా అతడితో టచ్లో ఉండేదాన్ని ఇంతలో అతను మరణించడం చాలా బాధగా అనిపించింది.. త్వరలోనే పీయూష్ కుటుంబాన్ని కూడా కలుస్తాము తన కూతురితో అంటూ తెలిపింది. శుభాంగి. శుభంగి, ఆత్రే 2003లో వివాహం చేసుకున్నారు.. 2005లో వీరికి ఒక పాప జన్మించింది. ఆ తర్వాత 2022లో వీరిద్దరూ విడివిడిగా జీవిస్తూ అదే ఏడాది విడాకులు మంజూరయ్యాయి. శుభంగి కసోజి జిందగీ అనే సీరియల్ ద్వారా మొదటిసారి తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత హవాన్, కస్తూరి తదితర సీరియల్స్లలో నటించింది.