ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్ కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల నుంచి కొత్త కొత్త ఉత్పత్తులు, అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్‌ అవుతున్న విద్యుత్‌ శ్రేణి స్కూటర్లు ఇంకా బైక్‌లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.అందుకే ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అప్‌ గ్రేడ్‌ చేస్తున్నాయి. కొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి.ఇంకా బ్యాటరీ కెపాసిటీని పెంచుతున్నాయి.అలాగే లుక్‌ లో కూడా కొన్ని మార్పులు చేసి సరికొత్తగా వాటిని లాంచ్‌ చేస్తున్నాయి. ఇదే విధంగా ఒకినావా ఆటోటెక్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అప్‌ గ్రేడ్‌ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఒకి-90 మోడల్‌ స్కూటర్‌కి ఏఐఎస్‌-156 సవరణని చేపట్టింది.కంప్లిమెంటరీ బ్యాటరీ ప్యాక్‌, నెక్ట్స్‌ జెన్‌ మోటార్‌ ఇంకా అడ్వాన్స్‌డ్‌ కనెక్టివిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవి కస్టమర్ లకి మంచి డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తాయడంలో ఎటువంటి సందేహం లేదు.దీనికి అప్‌గ్రేడెడ్‌ ఒకి-90 స్కూటర్లో డిజిటల్‌ స్పీడో మీటర్‌ ఉంటుంది. అలాగే బిల్ట్‌ ఇన్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది.బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్లు, అలెర్ట్స్‌, టైం డిస్‌ ప్లే ఇంకా మ్యూజిక్‌ నోటిఫికేషన్లు తెలిపే టెక్నాలజీని యాడ్ చేశారు. ఇంకా అంతేకాక మొబైల్‌ యాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ రియల్‌ టైం ఎస్‌ఓసీ మోనిటరింగ్‌ కూడా చేసుకోవచ్చు.అలాగే స్పీడ్‌ను కూడా మోనిటరింగ్‌ చేసుకునే ఫీచర్‌ ఉంటుంది.


ఇక కొత్తగా తీసుకొచ్చిన ఈ ఒకి-90 స్కూటర్‌ను మన దేశంలోని రోడ్ల పరిస్థితికి అనుగుణంగా డిజైన్ చేశారు.దీనికి 175ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంటుంది. అలాగే దీనిలో మైక్రో చార్జర్‌ ఉంటుంది.ఇంకా దీనిలో ఆటో కట్‌ ఫంక్షన్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. రీజనరేటివ్‌ ఎనర్జీతో కూడిన ఎలక్ట్రోనిక్‌ అసిస్టెంట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(ఈ-ఏబీఎస్‌)ను దీనికి అందించారు. ఇది గంటకు ఏకంగా 80 నుంచి 90 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్ తో ప్రయాణిస్తుంది. అలాగే దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్‌ పై ఏకంగా 160 కిలోమీటర్ల రేంజ్‌ ని ఇస్తుంది.అంతేగాక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లో జీపీఎస్‌ సెన్సింగ్‌, రియల్‌ టైం పొజిషనింగ్‌, జియో ఫెన్సింగ్‌ ఇంకా టర్న్‌ బై టర్న్‌ నావిగేషన అసిస్టెన్స్‌ అధునాతన ఫీచర్లు ఉంటాయి.ఈ స్కూటర్‌ ని ఏ మొబైల్‌ కి అయినా ఈజీగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లో ఒకినావా కనెక్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ స్కూటర్‌ను కంట్రోల్‌ చేయొచ్చు.అలాగే దీనిలో సేఫ్టీ కోసం విభిన్న రకాల సెన్సార్లు ఇంకా ఇంటెలిజెంట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇది వెనుకకు వెళ్లేటప్పుడు, పార్కింగ్‌ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. దీనికి యాంటీ థెఫ్ట్‌ అలారం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: