జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల కు సంబంధించి ఎగ్జామ్ ను మరొకసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగాల్సి ఉన్నది.. కానీ తాజాగా మారిన షెడ్యూల్ ప్రకారం సెక్షన్ -1 పరీక్షలను జూన్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జేఈఈ-మెయిన్.. సెక్షన్ -2 ఎగ్జామ్ జూలై 21 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

ఇక ఇదంతా ఇలా ఉండగా వైద్యవిద్య కళాశాలలో కి ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ 2022 కు సంబంధించి ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దేశం లో 543 ప్రాంతాలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు గా తెలుస్తోంది. ఈరోజు నుంచి అప్లై చేసుకునే వారికి మే -6 తేదీ వరకు చివరితేది దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పరీక్షలను జులై 17 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం..5:20 నిమిషాల వరకు నిర్వహించనున్నారు అట. ఈ పరీక్షలు తెలుగులో పాటు 13 స్థానిక భాషలలో కూడా నిర్వహించబోతున్నారు.

ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు.. రూ.1600 , ఈ డబ్ల్యూ ఎస్, ఓబీసీ ,NCL విద్యార్థులు కేవలం రూ.1500 రూపాయలు, SC,ST, థర్డ్ జెండర్ వారికి.. రూ.900 రూపాయలుగా విదేశీ విద్యార్థులకు మాత్రం..8,500 రూపాయలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక నీట్ ఎగ్జాం రాయాలంటే విదేశీ విద్యార్థుల కోసం 14 కంట్రీలలో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. అందులోUAE అబుదాబి, శ్రీలంక కొలంబో, యూఏఈ దుబాయ్, థాయిలాండ్ బ్యాంకాక్, బహ్రిన్ మనమా, సౌదీ అరేబియా రియాద్, యూఏఈ షార్జా, సింగపూర్ సింగపూర్ , ఓమన్ మస్కట్, నైగేరియా లాగోస్, కువైట్ కువైట్ సిటీ, మలేషియా కౌలాలంపూర్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: