అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వ‌రిస్తుందో చెప్పలేం. తాజాగా ఓ రోజువారీ కూలీ రూ. 6 ఖర్చుపెట్టి కోటి రూపాయిలు సంపాదించాడు. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ ఒక రోజువారీ కూలీ. స్థానిక‌ ఇటుక బట్టీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అత‌ని వీర్పాల్ కౌర్ కాగా.. వారికి ముగ్గురు సంతానం.


అయితే ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరా వెళ్లిన‌ప్పుడు రూ. 6 వెచ్చించి ఓ లాట‌రీ టికెట్ కొన్నాడు. టికెట్ కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ అతనికి వచ్చింది. శర్మ అనే వ్య‌క్తి ఫోన్ చేసి రాష్ట్ర లాటరీలో రూ.1 కోటి గెలుచుకున్న విష‌యాన్ని  జస్మాయిల్ సింగ్ కు తెలిపాడు. మొద‌ట ఆ విష‌యాన్ని అత‌ను న‌మ్మ‌లేక‌పోయాడు. వెంట‌నే తాను కొనుగోలు చేసిన టికెట్ చెక్ చేసుకోగా.. ఈ వారం ప్రారంభంలో తీసిన ల‌క్కీ డ్రాలో 50E42140 నంబర్ గల త‌న టికెట్‌కు జాక్‌పాట్ త‌గిలిన విష‌యం స్ప‌ష్ట‌మైంది. దాంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.


జస్మాయిల్, అతని కుటుంబం త‌మ‌ గ్రామంలో వేడుకలు చేసుకున్నారు. స్థానికుల‌కు స్వీట్లు పంచుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇక లాట‌రీలో వ‌చ్చిన డ‌బ్బుల్లో రూ. 25 లక్షలు అప్పులు క‌ట్ట‌డానికి ఉప‌యోగిస్తాన‌ని.. మిగ‌తా డబ్బును త‌న‌ పిల్లల భవిష్యత్తు కోసం భద్రపరుస్తాన‌ని జస్మాయిల్ ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపాడు. కాగా, రాష్ట్ర లాటరీ ద్వారా ఫిరోజ్‌పూర్ జిల్లా నుండి ఒకరు కోటీశ్వ‌రుడిగా మారడం ఇది నాల్గవసారి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: