ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యుడు తో పోలిస్తే డబ్బు ఉన్న వాళ్ళే పెట్రోల్ , డీజిల్ కొనాలంటే వెనుకంజ వేస్తున్నారు. అందరూ కూడా విద్యుత్ వాహనాల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ మేరకు టెల్సా కార్లు మార్కెట్ లో మంచి టాక్ ను అందుకున్నాయి.  ఎందుకు కంటే ఇవి విద్యుత్ ఛార్జింగ్ ఆధారంగా పనిచేస్తున్నాయి. చూడటానికి చాలా స్టైల్ గా , మంచి ఫీచర్స్ తో మార్కెట్ లో దూసుకు పోతున్నాయి.


డ్రాగన్ కంటే చౌకగా కార్లను ఉత్పత్తి చేసేందుకు గ్లోబల్ ఎలక్ట్రిక్ కారు దిగ్గజం టెస్లాకు రాయితీలు కల్పించేందుకు తాము సిద్ధం అని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత్‌లో కార్ల తయారీకి టెస్లా సిద్ధమైతే.. అవసరమైన అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని చెప్పారు. బెంగళూరులో టెస్లా కంపెనీ పేరును ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ నమోదు చేసిన కొన్ని వారాలకు నితిన్ గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు.విదేశాల నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడే స్థానిక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తే బాగుంటుంది.. అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.



ఈ నేపథ్యంలో దేశీయంగా కార్ల తయారీపై టెస్లా సంస్థ నుంచి భారత్‌కు సరైన హామీ రావడం సవాల్ కానున్నది. ఈ విషయమై స్పందించేందుకు టెస్లా యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. గత ఏడాదిలో 24 లక్షల విద్యుత్ కార్లను విక్రయించాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా కేవలం ఐదువేలు మాత్రమే విక్రయించింది.టెస్లా 12.5 లక్షల ఈవీ వాహనాలను విక్రయించింది. చైనాలో 2020లో మొత్తం కార్ల విక్రయాలు రెండుకోట్లుగా ఉన్నాయి... ఇటువంటి కార్ల తయారీలో భారత్ కు చైనా కు ఉన్న ముందు చూపు కూడా లేదని తెలుస్తుంది. లిథియం బ్యాటరీల్లో 80 శాతం విడి భాగాలు స్థానికంగానే తయారవుతున్నాయని, అందువల్ల భారత్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా అవతరించేందుకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా సందర్భాల్లో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: