గత వానా కాలం సీజన్‌లో అకాల వర్షాలు, అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పసుపు రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 50 నుంచి 70 శాతం దెబ్బతిన్న దృష్ట్యా... బీమా సదుపాయం లేకపోవడం వల్ల పరిహారానికి నోచుకోవడం లేదని బీజేపీ అంటోంది. ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పసుపు రైతులకు బీమా పరిహారం అందకుండాపోయిందని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర 6 నుంచి 7,500 రూపాయలు ఉండగా... ఆ ధరలు రైతులకు ఏ మాత్రం సరిపోవని ఆ పార్టీ ఎంపీ అర్వింద్‌ స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని ఎంపీ అర్వింద్‌ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందా అంటే అదీ లేదు... కనీసం లేఖ కూడా రాయలేదని ఎంపీ అర్వింద్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ అంశంపై తాను లోక్‌సభలో‌ ప్రస్తావిస్తే ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన రాలేదని సమాధానం వచ్చిందని ఎంపీ అర్వింద్‌ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు ఎలా సహాయం చేస్తారో చెప్పాలని ఎంపీ అర్వింద్‌ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని ఎంపీ అర్వింద్‌ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR