ఇవాళ్టి నుంచి ప్రజానీకానికి రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ సహా అన్ని గార్డెన్ల పేర్లను 'అమృత్ ఉద్యాన్' గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మార్చారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ ఉద్యానోత్సవ్ 2023 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారభింస్తారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు... రెండు రాష్ట్రపతి భవన్ ఉద్యానవనాలు అందుబాటులో ఉంటాయి.


మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల్లోని వారికి అనుమతి ఉంటుంది. ప్రతి రోజు 6 స్లాట్లుగా విభజించి సందర్శనకు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అనుమతిస్తారు. సామాన్య ప్రజానీకానికి ఆన్ లైన్ బుకింగ్ ద్వారా అనుమతి లభిస్తుంది. ఉద్యానవనాలోని అన్ని మొక్కలకు క్యూ ఆర్ కోడ్స్ ఏర్పాటు చేసిన అధికారులు.. 12 రకాల తులిప్స్, 120 రకాల గులాబీ మొక్కలు ఈ ఏడాది సందర్శకులకు కనువిందు చేసేలా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: