జుట్టు ఎక్కువగా రాలడం వల్ల ఖచ్చితంగా పలుచగా మారుతుంది. అలాగే ఖచ్చితంగా ఇది బట్టతలకు దారి తీస్తుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందని కారణంగా జుట్టు చాలా బలహీనంగా మారి ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వివిధ రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేక నిరుత్సాహపడే వారి సంఖ్య చాలా ఎక్కువవుతుంది ఈరోజుల్లో.అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నూనెను వాడడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ కూడా బాగా అంది జుట్టు బలంగా ఇంకా ధృడంగా మారుతుంది. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ . జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేయడానికి మనం ముఖ్యంగా వేపాకుని ఉపయోగించాలి.ఎందుకంటే వేపాకులో మన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉన్నాయి.ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి.


అలాగే వేపాకును ఉపయోగించడం వల్ల చుండ్రు ఇంకా దురద వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.ముందుగా వేపాకును తీసుకొని దానిని శుభ్రంగా కడిగి నీడలో రెండు గంటల పాటు ఆరబెట్టాలి. ఆ తరువాత ఈ ఆకులను జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అర కప్పు కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలి.తరువాత ఈ నూనెను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. ఆ తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక అందులో కొబ్బరి నూనె గిన్నెను ఉంచి వేడి చేయాలి. కొబ్బరి నూనె వేడయ్యాక ఇందులో ముందుగా తయారు చేసుకున్న వేపాకు పేస్ట్ ను రెండు టీ స్పూన్లు వేసి కలపాలి. వేపాకు గుణాలన్నీ నూనెలో కలిసి నూనె డార్క్ గ్రీన్ కలర్ అయ్యే దాకా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత ఈ నూనెను వడకట్టి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు ముని వేళ్లతో జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో లేదా సాధారణ నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారినికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: