ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు వార్నింగ్ ఇచ్చారు. తమకు గతంలోఇచ్చిన హామీలు నెరవేర్చని సిఎం జగన్ మీద ఉద్యోగులు ఫైర్ అయ్యారు. విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జి. ఆస్కారరావు స్ధానిక ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగుల కష్టాలను విన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు చేయడంలో సిఎం జగన్ మాట మార్చరాదు- మడమ తిప్పరాదు అని ఆయన డిమాండ్ చేసారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాల్సిందే అని ఆయన పట్టుబట్టారు.  సిపిఏస్ రద్దుతో పాటు పిఆర్సీ, పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి అని ఆస్కార రావు డిమాండ్ చేసారు. కాగా ఏపీ సర్కార్ సీపీ ఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: