తెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి నిర్వ‌హించే ఉప ఎన్నికల ప్ర‌చారం రోజు రోజుకు జోరందుకుంటుంది. అన్ని పార్టీల‌కు సంబంధించిన అభ్య‌ర్థులు త‌మ ప్ర‌చారాన్ని హోరెత్తుగా నిర్వ‌హిస్తున్నారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా ఓట్లను అభ్య‌ర్థిస్తున్నారు. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్‌కు మ‌ద్ద‌తుగా మంత్రులు హ‌రీశ్‌రావు,  గంగుల క‌మ‌లాక‌ర్‌, ఎమ్మెల్యేలు జోరుగా ప్ర‌చారం చేప‌డుతున్నారు.  మంత్రి హ‌రీశ్‌రావు త‌న భుజాల‌పై వేసుకొని ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు.

మ‌రోవైపు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కూడా ప్ర‌చారాన్ని జోరుగా చేప‌డుతున్నారు. అయితే టీఆర్ఎస్‌కు ధీటుగా ప్ర‌చారం చేప‌ట్టేందుకు ఒక ప‌థ‌కం ప‌న్నారు.  ఇందులో ముఖ్యంగా కేంద్ర హోంశాఖ‌మంత్రి అమిత్‌షాను రంగంలోకి దించ‌నున్న‌ట్టు స‌మాచారం.  ఈట‌ల గెలుపుతో తెలంగాణ‌లో పాగా వేసేందుకు మెండుగా అవ‌కాశాలు ఉంటాయ‌ని బావిస్తోంది బీజేపీ. గెల్లు శ్రీ‌నివాస్ కు మ‌ద్ద‌తుగా సీఎం కేసీఆర్ త్వ‌ర‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా ఈట‌ల గెలుపించేందుకు బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కేసీఆర్ నిర్వ‌హించే స‌భ‌కు ధీటుగా బీజేపీ ప్ర‌చార‌స‌భ నిర్వ‌హించి టీఆర్ఎస్  దూకుడుకు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది. తొలుత అమిత్‌షా స‌భ‌ను ర‌ద్దు చేసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న‌ రాజ‌కీయ త‌రుణంలో అమిత్‌షాతో స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌భ ఎప్పుడ‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: