ఇటీవల కాలంలో దొంగలు బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది. కేవలం మనదేశంలోనే కాదండోయ్ ఇతర దేశాల్లో సైతం ఇలాగే దొంగలు రెచ్చిపోతూ ఏకంగా పోలీసులకే సవాలు విసురుతూ ఉన్నారు. అంతేకాదు నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎంతో అలవోకగా చోరీలకు పాల్పడటం ఎలా అని బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇక కొంతమంది పోలీసులకు ఎలాంటి ఆచూకీ దొరక్కుండా చోరీలు చేయడం ఎలా అని యూట్యూబ్ వేదికగా చూసి మరి చోరీలు చేస్తూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.


  మామూలుగా అయితే చోరీకి పాల్పడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రహస్యంగా ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా దొంగతనానికి వెళ్ళిన సమయంలో ఎవరికంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం అలా చేయడం లేదు. ఏకంగా ఏదో అర్జెంటు పని మీద ప్రయాణం చేస్తున్నట్లుగా క్యాబ్ బుక్ చేసుకుని మరి వెళ్లి దొంగతనానికి పాల్పడుతూ ఉంటాడు. చేసేది నేరం అయినా సరే కానీ భయపడకుండా దర్జాగా చేస్తూ ఉన్నాడు.


 ఇటీవల అమెరికాలోని మిచి గాన్ సౌత్ ఫీల్డ్  బ్యాంకులో ఒక దోపిడీ జరిగింది. అయితే చొరకి పాల్పడిన పేరు జెస్సన్ క్రిస్ట్మస్. ఇతను బ్యాంకులో దోపిడీకి వెళ్లేందుకు ఏకంగా ఊబర్లో ఒక కారును బుక్ చేసుకున్నాడు.  బ్యాంకులో పని ఉంది అని చెప్పి ఇక ఆ క్యాబ్ డ్రైవర్ ను బయట వెయిట్ చేయమని సూచించాడు. ఇక వెయిటింగ్ చార్జెస్ కూడా ఇస్తాను అంటూ చెప్పడంతో ఆ డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలకు వెళ్లి అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఎంతో హుందాగా మళ్లీ నడుచుకుంటూ వచ్చి క్యాబ్లో ఎక్కేసాడు. తన ఇంటి వద్ద దింపమని క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు. బ్యాంకు లోపల జరిగింది ఏమీ తెలియని క్యాప్ డ్రైవర్ నేరుగా తీసుకెళ్లి అతని ఇంటి దగ్గర దింపేశాడు.  ఇక క్యాబ్ నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్ ను ప్రశ్నించి చివరికి  అసలు నేరస్తుడిని పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: