వివాహేతర సంబంధం నేటి రోజుల్లో ఎన్నో అనర్థాలకు ఎన్నో దారుణాలకు కారణమవుతుంది. వివాహేతర సంబంధం తప్పు అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ క్షణకాల సుఖం కోసం మానవతా విలువలను మరిచి ఎంతోమంది బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంటారు. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. అయితే ఇలా క్షణకాల సుఖం కోసం పెట్టుకుంటున్న వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు కారణం అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది వివాహేతర సంబంధాల కారణంగా దారుణంగా హత్యలకు గురవుతారు. అయినప్పటికీ ఎవరి తీరులో మాత్రం మార్పు రావడంలేదు ఎంతో మంది ఇంకా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు  దీంతో దారుణ ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బెంగుళూరులో బనశంకరి లోని యూరబ్ నగర్ లో మహిళా టైలర్ గా పని చేస్తున్న ఆఫ్రీనా ఖనం అనే మహిళా దారుణంగా హత్యకు గురికావడం సంచలనంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తులతో పొడిచి దారుణంగా చంపి మృతదేహానికి బట్టలు వేసి నిప్పంటించాడు.


 కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ మహిళ బంధువైన 17 ఏళ్ల విద్యార్థి ఈ పని చేశాడు అన్న విషయం పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆఫ్రినా ఇంటి పక్కనే నిందితుడి కుటుంబం కూడా కొత్త ఇళ్ళు కడుతు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఆఫ్రినా ఇంటికి సదరు 17 ఏళ్ల బాలుడు వస్తూ ఉండేవాడు.  ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటూ ఆఫ్రీనా బాలుడి పై ఒత్తిడి చేసింది. దీంతో అతను నిరాకరించాడు. కానీ  కొన్ని డబ్బులు కావాలి అంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే  కత్తెర  తీసుకుని ఆఫ్రినా పై దారుణంగా పొడిచి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: