ఏంటి అక్కినేని ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి భాజాలు మోగబోతున్నాయా? ఇది నిజమేనా.. అక్కినేని ఫ్యామిలీలోకి మిస్ ఇండియా కోడలుగా రాబోతోందా? ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా రాబోతున్న మిస్ ఇండియా  ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటికే రెండు శుభకార్యాలు జరిగాయి. ఒకటి నాగచైతన్య శోభితల పెళ్లి, మరొకటి అఖిల్ జైనబ్ రావడ్జీల పెళ్లి.. రెండు శుభకార్యాలు జరగడంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంది. అంతేకాదు చాలా రోజుల నుండి పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్న నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది.

 మరి ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి చేసుకోబోతున్న ఆ నెక్స్ట్ హీరో ఎవరయ్యా అంటే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్.. హీరో సుశాంత్ మిస్ ఇండియా అలాగే హీరోయిన్ అయినటువంటి మీనాక్షి చౌదరీని పెళ్లాడబోతున్నారనే వార్త సినీ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే పలు మార్లు సుశాంత్ మీనాక్షి చౌదరిల పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇందులో ఎలాంటి నిజం లేదని బయటపడింది.కానీ ఆ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో జంటగా కనిపించేసరికి డౌటే లేదు..

వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తోంది అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మీనాక్షి చౌదరి సుశాంత్పెళ్లి జరగబోతుంది అనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దాంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు అక్కినేని ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. అక్కినేని ఫ్యామిలీలోకి మిస్ ఇండియా మీనాక్షి చౌదరి కోడలుగా అడుగు పెట్టబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మీనాక్షి చౌదరి సుశాంత్ కాంబినేషన్లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే  అప్పటినుండే వీరి మధ్య లవ్ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: