
ఇంకొన్నిసార్లు ఏకంగా పట్టపగలే ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి అందిన కాడికి దోచుకుపోతున్నారు. మరి కొంతమంది దొంగలు రెగ్యులర్ స్టైల్ లో ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి రహస్యంగా చొరబడి చోరీలు చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువవుతుంది. అయితే ఒకసారి ఇలా దొంగలు చోరీ చేసిన తర్వాత ఆ సొమ్ము మొత్తాన్ని అమ్ముకోవడం లేదా ఇంకా ఏదైనా చేయడమో చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం చూస్తూ ఉంటాం
కానీ ఇలా చోరీ చేసిన మొత్తాన్ని మళ్లీ తిరిగి ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా.
వినే ఉంటారు.. ఎందుకంటే సినిమాల్లో అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయ్. కానీ నిజజీవితంలో అంత మంచి దొంగలు ఉంటారా అంటే అస్సలు ఉండరు అని సమాధానం చెబుతారు అందరు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరగదు. వరంగల్ జిల్లా బొల్లికుంటలోని ఒక ఇంట్లో దొంగలు పడి ఏకంగా 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పక్క ప్లాన్ తో ఇది యజమానులు లేనిది చూసి తలుపులు పగులు కొట్టి చోరీ చేశారు. బాధితులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులకు దొరుకుపోతామని భయపడ్డారో లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ 30 తులాల బంగారంలో 27 తులాలు మళ్లీ చోరీ చేసిన ఇంటి ప్రహరి గోడ పై పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగలు.