సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకిపోయిన నేపథ్యంలో ఇక ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో వింతైన ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని వింతైన వ్యాధుల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా చిన్నారులు ఏం తింటారు అంటే చిరుతిళ్లు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.



 ఇంట్లో తల్లి ఎంత మంచి ఆహారం చేసి పెట్టిన.. అది తినడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు అని చెప్పాలి. అందుకే ఇక చిన్న పిల్లలకు ఆహారం తినిపించాలి అంటే అది పెద్ద సవాలతో కూడుకున్న పని అని ఎంతో మంది తల్లులు చెబుతూ ఉంటారు. అది సరే కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు ఆహారం తినిపించడం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. ఇక్కడ ఒక మూడేళ్ల బాలిక తరచూ తింటుంది. ఇంకేముంది అందరి పిల్లల అల్లరి చేయకుండా తింటుంది దానిలో.. తప్పేముంది అంటారా. అయితే ఆ బాలిక తింటుంది అందరూ తినే ఆహారం కాదు. ఏకంగా ఇల్లును తినేస్తుంది. ఇల్లును తినడమేంటి అది కూడా మూడేళ్ల బాలిక వినడానికే విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.



 యూకే లో ఇలాంటి తరహా ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల బాలిక వింటర్ ఆటీజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తుంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడలు, ప్లాస్టర్ వంటివి ఆహారంగా తింటుంది.  నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇంటిని మొత్తం తినేస్తుంది ఆ మూడేళ్ల బాలిక  ఎప్పుడు తినని వస్తువులను తినేందుకు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుందట ఆ బాలిక. ఇక ఈ విషయాన్ని ఆమె తల్లి చెప్పుకు వచ్చింది. 13 నెలల వయస్సు ఉన్నప్పటి నుంచి తన కూతురికి పైకా వ్యాధి ప్రారంభమైంది అంటూ తల్లి చెప్పుకొచ్చింది. దీనిపై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: