ఇటీవల కాలంలో ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా అనే మాయలో మునికి తేలుతూ ఉన్నాడు. తెలియకుండానే సోషల్ మీడియాకు బానిసగా మారిపోతున్నాడు. దీంతో ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఇక ఇంటర్నెట్ ప్రపంచంలో కనీసం కొన్ని గంటలైనా గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వెరసి ఇలా మనిషిని పూర్తిగా బానిసగా మార్చేసుకుంటున్న సోషల్ మీడియా కొన్ని కొన్ని సార్లు మనిషి ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతుంది. ఇప్పుడైతే పెద్దగా ఇలాంటి ఛాలెంజ్ లు కనిపించడం లేదు. కానీ మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని వింతైన చాలెంజ్ లు వైరల్ గా మారిపోతూ ఉండేవి. దీంతో ప్రపంచ నలమూలలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి ఛాలెంజ్లను యాక్సెప్ట్ చేస్తూ తాము కూడా అలాంటివి చేసి మరొకరికి ఛాలెంజ్ విసరడం లాంటివి చేసేవారు. ఇలాంటి ఛాలెంజ్ల కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కొన్ని గేమ్స్ సైతం ఇలా మనుషుల ప్రాణాలకు హానికరంగా మారాయి అని చెప్పాలి. అయితే ఇలా ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిపోయిన బ్లూ వేల్ గేమ్ ఇప్పుడు మరోసారీ మీదికి వచ్చింది.


 ఈ గేమ్ ఏకంగా ఒక భారతీయుడు ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో ఈ బ్లూ వేల్ గేమ్ ఆడి ఓ భారత విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకోవడానికి బ్లూ వేల్ ఛాలెంజే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగబట్టినట్లు సమాచారం. ఈ కేసు పై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని.. అక్కడి పోలీసులు చెబుతున్నారు. అయితే ఇలా ఆత్మహత్యలను ప్రోత్సాహిస్తున్న బ్లూ వేల్ గేమ్ పై కొన్ని దేశాలు ఇప్పటికే నిషేధాన్ని విజించాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: