పాతాళంలోకి కూరుకుపోతున్న తెలుగుదేశంపార్టీని మళ్ళీ లేపటానికి చంద్రబాబునాయుడు వల్లే కావటంలేదు. 2019 ఎన్నికల్లో మొదలైన టీడీపీ డౌన్ ఫాల్ తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలతో మరింతగా దిగజారిపోయింది. పరిషత్ ఎన్నికలు కూడా జరిగిపోయుంటే మరింతగా కూరుకుపోయేదనటంలో సందేహంలేదు. సరే ఆపని రేపైనా జరిగేదే అనుకోండి అదివేరే సంగతి. ఇంతలో హఠాత్తుగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వచ్చిపడింది. దాంతో ఈ ఎన్నికలో పరువు నిలుపుకోవటం ఎలాగనే సమస్యతో చంద్రబాబు+తమ్ముళ్ళంతా నానా అవస్తలు పడుతున్నారు. సరిగ్గా  ఈ సమయంలోనే ఎల్లోమీడియా టీడీపీని భుజనా మోయటం మొదలుపెట్టింది.




తాజాగా ఆదివారం రాసిన కొ(చె)త్తపలుకులో తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభివృద్ధి నినాదంతోను, టీడీపీయేమో ప్రత్యేకహోదా నినాదంతోను ప్రచారం చేసుకుంటున్నాయట. వైసీపీ అభివృద్ధి నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్న మాటమాత్రం వాస్తవం. కానీ టీడీపీ మాత్రం ఎక్కడా ప్రత్యేకహోదా నినాదంతో ప్రచారం చేయటంలేదు. ఎందుకంటే ప్రత్యేకహోదా డిమాండ్ ను మంటకలిపేసిందే చంద్రబాబునాయుడని అందరికీ తెలుసు. విభజనచట్టంలో ఉన్న ప్రత్యేకహోదాను ఇచ్చేది లేదని నేరుగా చెప్పకుండా కేంద్రప్రభుత్వం ఎలా ఆడిస్తే చంద్రబాబు అలా ఆడాడు. ప్రత్యేకహోదా స్ధానంలో దానికి మించిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెబితే తలూపారు. తర్వాత హోదా హీట్ పెరిగిపోతోందని గ్రహించి ప్యాకేజీ వద్ద హోదానే ముద్దంటు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు.




తాను అధికారంలో ఉన్న ఐదేళ్ళు కేంద్రం చేతిలో తోలుబొమ్మలాగ ఆడిన చంద్రబాబు ఇఫుడు ప్రత్యేకహోదా నినాదంతో ముందుకెళుతున్నారని ఎల్లోమీడియా గట్టిగా టముకేసి చెబుతోంది. నిజానికి ప్రచారంతో ఎలా ముందుకెళ్ళాలో అర్ధంకాక నానా టీడీపీ నేతలు నానా అవస్తలుపడుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ప్రత్యేకహోదా నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తే జనాలు నమ్ముతారా ? చంద్రబాబు అండ్ కో కు ధైర్యం లేకపోయినా ఎల్లోమీడియా మాత్రం ప్రత్యేకహోదా నినాదంతో ముందుకెళ్ళమని ధైర్యం చెబుతున్నట్లే ఉంది. మొత్తానికి ఉపఎన్నికలో టీడీపీని గెలిపించేందుకు ఎల్లోమీడియా పడుతున్న అవస్తలు మాత్రం అర్ధమైపోతోంది. చివరకు గెలుపు సంగతి పక్కనపెట్టేస్తే కనీసం పరువైనా నిలుపుకుంటుందో లేదో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: