పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమత బెనర్జీతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ప్రమాణస్వీకారం వేదికపై గవర్నర్‌, ముఖ్యమంత్రి ఇరువురు మర్యాదలు మరచిపోయి విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రం లో హింస చెలరేగి పోతున్నవేళ, హింసను నియంత్రించా లని ముఖ్యమంత్రిని కోరినట్లు గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రం లో కొత్త ప్రభుత్వం శాంతి నెల కొనేలా పని చేయాలని పేర్కొన్నారు.


ఇప్పటి వరకు రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు - ఎన్నికల సంఘం, గవర్నర్‌ కారణమన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇక బెంగాల్‌ ప్రశాంతంగా ఉంటుందన్నారు.


కాని రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి దాడులు, అల్లర్లు, రాజకీయ హింస కొనసాగుతుంది. ఫైర్-బ్రాండ్ మమత బెనెర్జీ మాటల్లో ప్రతీకార జ్వాలలు కనిపిస్తున్నాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌ కు వచ్చిన బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా బుధవారం కోల్‌కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు కొనసాగుతున్న దాడులు, అల్లర్లు, రాజకీయ హింస నుంచి బెంగాల్‌ ను, బెంగాల్‌ ప్రజలను కాపాడు తానని ప్రతిజ్ఞ చేశారు.


ఉత్తర 24 పరగణాల జిల్లా సహా పలు జిల్లాల్లో అమానుష దాడుల్లో చనిపోయిన బీజేపీ సభ్యుల కుటుంబాలను కలుస్తానని, ఇక్కడి దారుణ సంఘటనలను దేశం మొత్తానికి చాటిచెపుతానని బెంగాల్‌ ప్రజల హృదయాల్లో తమ పార్టీ సేవా కార్యక్రమాలు ద్వారా నిలిచిపోయేలా చూస్తానని ఆయన ప్రగాడ విశ్వాసం తో తెలిపారు.


హింస కారణంగా 14 మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్షమంది స్థానికులు సొంతూర్లను వదిలేసి పోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉంది గనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారని, హింస ను ప్రేరేపించిన మమత చేతులు ఇప్పటికే రక్తంతో తడిశాయి. నిరుడు “అంపన్‌” తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణం గా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాలీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు.


“పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయనేత. ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె కేవలం ప్రధాని మోదీని, మోదీ మంత్రి వర్గాన్ని మాత్రమే గాక, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు” అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ బుధవారం వ్యాఖ్యానించారు. అయితే అదే కమల్ నాథ్ కేంద్ర నిఘాసంస్థలను రాజకీయ శత్రువులపై ప్రయోగించే సంస్కృతి దేశంలో మొదలైంది కాంగ్రెస్ హయాం లోనే అన్న విషయం ఆయన మరచినట్లున్నారు.


రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న పాత్రికేయుల ప్రశ్నకు “ఆ విషయం ఇప్పుడే తెలియదని, యూపీఏ సరైన సమయం లోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుంది” అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడినట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించినట్లు చెప్పారు.


బీజేపీ అజేయశక్తి కాదని, ఆపార్టీని ఓడించవచ్చని బెంగాల్‌ ఎన్నికలు నిరూపించాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ, ప్రజలకు ఆక్సిజన్‌ అందివ్వడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీకే రాజకీయ ప్రాణవాయువు అవసరం’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 213 సీట్లను నెగ్గి ఘనవిజయం సాధించిన మమత బుధవారం వరుసగా మూడోసారి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఫలితాల అనంతరం బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు బీజేపీయే కారణమని ఆరోపించారు. అవమానకరమైన ఓటమి నుంచి దృష్టి మరల్చడానికి, మతఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ మతతత్వపార్టీ అన్నారు.


‘బీజేపీని ఓడించొచ్చు మనది ప్రజాస్వామ్యదేశం. ప్రజల అభీష్టమే అంతిమం. బెంగాలీలు మార్గనిర్దేశం జరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో లెక్కలేనితనం, అహంకారం అహం పనికి రాదు. ఎన్నికల సంఘం రాజధర్మాన్ని పాటించి, ఒక్క బీజేపీకే కాకుండా అన్ని పార్టీలకు అండగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మమత అన్నారు.


దర్యాప్తు సంస్థలను, అధికారాన్నిదుర్వినియోగం చేస్తూ సమాఖ్య వ్యవస్థను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘ఏజెన్సీ రాజకీయాలకు (సీబీఐ, ఈడీలను ప్రత్యర్థులపై వాడటం) తెరపడాలి. అప్పుడే నరేంద్ర మోదీ– అమిత్‌ షా రాజకీయ శకం ముగుస్తుంది. ఈ తరహా రాజకీయాలు దేశానికి అవసరం లేదు. మోదీ - షాల కంటే సమర్థులైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు’ అని మమత అన్నారు.


2024లో పత్రిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వస్తారా? అని ప్రశ్నించినపుడు మమత ఆచితూచి స్పందించారు. ‘ఇప్పటికిప్పుడు అన్నీ నిర్ణయించలేం. ‘కామన్‌-మినిమమ్‌ ప్రోగ్రామ్‌’ అంటూ ఒకటి ఉండాలి. ఇది కోవిడ్‌ పై పోరాడాల్సిన సమయం. పరిస్థితులు చక్కబడ్డాక దానిపై దృష్టి పెడతాం. ఒక నిపుణుల బృందాన్ని నియమిస్తాం. వాళ్లు మాకు మార్గనిర్దేశం చేస్తారు. ఏదో ఒకటి దానంతటదే జరుగుతుంది. ఎందుకంటే దేశం ఈ విపత్తును ఎదుర్కొన లేదు. బీజేపీ అంటేనే ఓ విపత్తు’ అని మమత వ్యాఖ్యానించారు బెంగాల్ టైగర్మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ గెలుపు వెంటనే బిజేపి పతనం మొదలైందా?


మరింత సమాచారం తెలుసుకోండి: