పుణ్య గోదావ‌రి చెంత
అల‌లే వినిపించు హోరులో
పావ‌న తీర్థాల చెంత
కొన్నంటే కొన్ని రంగులు
రాజ‌కీయ రంగులు అని రాయాలి నీవు


ఒక కాపు ఒక క్ష‌త్రియ మ‌ధ్య‌లో
అక్క‌డో చౌద‌రి ఇక్క‌డో రెడ్డి..
ఇవే ఆ నేల‌ను శాసించే గుణాలు
కావొచ్చు.. కాక‌పోనూ వ‌చ్చు..


పాపికొండ‌లు స‌మీపం ఓ చోటు
జంగారెడ్డి గూడెం స‌మీపం ఇంకోచోటు
క‌న్నీళ్లే వెత‌లే శాసించు చోటు ఇంకో చోటు
అలాంటి నేల‌లో వ‌ర్గ రాజ‌కీయాల క‌థ ఇది
చ‌ద‌వండి..డిస్క‌ష‌న్ పాయింట్  

............ఎవ‌రు గొప్ప‌?
ఎమ్మెల్యే వెర్స‌స్ ఎంపీ?
గ‌త కొద్ది రోజులుగా న‌లుగుతున్న అంత‌ర్యుద్ధం.ఆ ఇద్ద‌రి అశాంతికి ఇది సంకేతం.ఒకరు ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్,మ‌రొక‌రు చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజా..ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో కూడిన రాజ‌కీయం నడుస్తోంది.దీంతో నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ కార‌ణం గా అటు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఇటు ప్ర‌జాప్ర‌తినిధుల సొంత మ‌నుషులూ న‌లిగిపోతున్నారు.త‌గాదా అధిష్టానం దగ్గ‌ర‌కు వెళ్ల‌లేదు కా నీ ఇప్ప‌టి కిప్పుడు ఈ వైరం అయితే స‌మ‌సిపోయేలా లేదు.వాస్త‌వానికి చింత‌ల‌పూడి ఎమ్మెల్యే త‌ప్పిదాలే అధికంగా ఉన్నాయ ని,అందుకే ఎంపీ ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణించడం లేద‌ని తెలుస్తోంది.గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం త‌గా దాల‌కు కార‌ణం అయితే,ఇప్పుడు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం వ‌ర్గ విభేదాల‌కు తావిస్తోంది.క్షేత్ర‌స్థాయిలో సౌమ్యుడిగా శ్రీ‌ధ‌ర్ ప్ర‌జ ల నుంచి మంచి పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ,ఎమ్మెల్యే తీరు కార‌ణంగా ఆయ‌న కాస్త అస‌హ‌నానికి లోన‌వుతున్నార‌న్న‌ది వాస్త‌వం.


...........టీడీపీ రాజ‌కీయం ఫ‌లిస్తుందా ?
కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ కొంప ముంచుతుందా?
కామ‌వ‌ర‌పు కోట మండ‌లంలోనూ ఇత‌ర ప్రాంతాల‌లోనూ టీడీపీ రాజ‌కీయం ఫ‌లించేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయ‌ని తె లుస్తోంది. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న నాయ‌కుల‌ను గ‌త ఎన్నిక‌ల్లో విభేదించిన వారిని ఇటుగా తీసుకువ‌చ్చి పార్టీకి వెన్నుపోటు పొ డిచే రాజకీయాలు న‌డుపుతున్నార‌న్న వాద‌న ఎమ్మెల్యే విష‌య‌మై న‌డుస్తోంది.దీంతో వైసీపీలో టీడీపీ కోవ‌ర్టులు అధికం అయ్యా రని ఇదెంత మాత్రం మంచిది కాద‌న్న భావ‌న ఎంపీలోనూ ఉంది. కానీ ఎమ్మెల్యే త‌న మాట నెగ్గించుకునే క్రమంలో వ‌ల‌స రాజ‌కీ యాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌న్న విమ‌ర్శ ఒక‌టి ఎదుర్కొంటున్నారు.


వాద‌న‌కు తావే లేని వాస్త‌వం....
ఈ ఆధిప‌త్య పోరులో భాగంగా కొన్ని ప‌ద‌వుల పంప‌కం, కొన్ని చోట్ల ఓటు బ్యాంకు రాజ‌కీయం విప‌రీతంగా మారిపోతున్న సంద ర్భాన వీరిని నియంత్రించే వారెవ్వ‌రా అన్న‌ది తేల‌డం లే దు.అధిష్టానం ఎంట‌రైతే త‌ప్ప ఈ స‌ మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికేలా లేదు. ముఖ్యంగా ఎంపీ ప‌రంగా త‌ప్పిదాలు త‌క్కువే ఉన్నాయ ని,కానీ ఎమ్మెల్యే దుందుడుకు కార‌ణంగా కొన్నింట ఆయ‌న‌కు కోపం వ చ్చే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని స్థానికులు చెబుతున్న మా ట.వాస్త‌వానికి ఇద్ద‌రిలో స్థానికంగా ప‌ట్టున్న నేత,కామ‌వ‌ర‌పు కోట లాం టి పెద్ద మండ‌లాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత శ్రీ‌ధ‌రే అన్నది వాద‌న‌కు తావే లేని వాస్త‌వం.

ముందున్న కాలంలో
తేలాల్సిన ప‌రిణామం....
ఏలూరు ఎంపీగా ఆయ‌న చేయాల్సిన అభివృద్ధి కూడా ఎంతో ఉన్న త‌రుణాన కేవ‌లం త‌గాదాల‌కే ప్రాధాన్యం ఇస్తారా లేదా స్థానిక సమ‌స్య‌ల ప‌రిష్కారానికి నియోజ‌క‌వ‌ర్గాల‌కు అతీతంగా ప‌నిచేసి పేరు తెచ్చుకుంటారా అన్న‌ది ఇప్పుడిక ఆసక్తిదాయ‌కం.ఇప్ప‌టికే ఈ ప్రాంతం నుంచే గెలిచిన న‌ర‌సాపురం ఎంపీ ఆర్ ఆర్ ఆర్ ఓ త‌ల‌నొప్పిగా మారిన విష‌యం విధిత‌మే!ఇప్పుడిదే కోవ‌లో కోట‌గిరి వార‌సుడు ఉంటారా? లేదా సౌమ్య‌త‌కు ప్రాధాన్యం ఇస్తారా అన్న‌ది ముందున్న కాలంలో తేలాల్సిన ప‌రిణామం.  



మరింత సమాచారం తెలుసుకోండి: