కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.ఇండియాకి చెందిన లీడింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్‌ అనుబంధ సంస్థ అయిన టీసీఎస్‌ అయాన్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్ (TCS NQT 2021) ప్రకటన విడుదల చేసింది.ఇక ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా పలు కార్పొరేట్‌ సంస్థల్లో ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్లను జరుపుతారు. ఇక ఈ టెస్ట్‌లో ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌కు కంపెనీలు అభ్యర్థి నుంచి ఆశించే సంబంధించి కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ను ఈ ఎన్‌క్యూటీలో పరీక్షిస్తారట.ఇక ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌కు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక అభ్యర్థులు వారి ఇంటి నుంచే ఈ పరీక్షను సులభంగా రాయవచ్చు. ఒకవేళ పరీక్షకు అవసరమైన సరైన సౌకర్యాలు కనుక లేకుంటే దగ్గరలోని టీసీఎస్‌ అయాన్‌ సెంటర్లలో పరీక్షని రాయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్‌క్యూటీని నిర్వహిస్తారు.స్కోర్ ను మెరుగుపరచుకోవడం కోసం మళ్లీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు.

ఇక టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ద్వారా టీసీఎస్ ఐయాన్ జాబ్ లిస్టింగ్ పోర్టల్‌లో ఉన్న జాబ్ లకు దరఖాస్తు చేసుకోవచ్చునట. ఇక ఇప్పటికే టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ పాస్ అయిన వారిలో 55,000 పైగా అభ్యర్థులు టీసీఎస్, టీవీఎస్ మోటార్ ఇంకా ట్రెడెన్స్ లాంటి కంపెనీల్లో ఫ్రెషర్స్‌గా జాబ్స్ సాధించడం విశేషం.ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా పాస్ అయిన వారు ఇంకా ప్రీ-ఫైనల్ ఫైనల్ చదువుతున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చట. ఏ కోర్సు చదువుతున్న వారైనా సరే వీటికి అప్లయ్‌ చేయొచ్చు.ఇక ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు వీటికి చేయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతోంది. 2021 ఆగస్టు ఇంకా నవంబర్ ఎగ్జామ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునట.పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్‌ ని సందర్శించండి :https://www.tcs.com/careers/TCSCampusHiringYoP2021

మరింత సమాచారం తెలుసుకోండి:

tcs