మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలియదు కానీ.. సర్వేలతో ప్రజల మూడ్ మార్చేందుకు మాత్రం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో సర్వే చేపట్టే సంస్థలు వాటిని ప్రకటించే మీడియా యాజమాన్యాలు విశ్వసనీయతకు పెద్ద పీట వేసేవి. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. అలాగని అన్ని సర్వే సంస్థలు ఈ విధమైనవి అని కూడా చెప్పలేం. ఏపీలో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీ కి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పాయి.


తాజాగా వస్తున్న సర్వేలు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ లకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో సర్వే సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పోల్ స్ర్టాటజీ సర్వే  సంస్థ వైసీపీకి 128 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మరోవైపు కూటమికి 47-57 సీట్లకు పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది.


ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను చూసుకుంటే ఇండియా టుడే, సీ ఓటర్ లాంటి ఒకటి రెండు సంస్థలు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఇండియా టీవీ, సీఎన్ఎక్స్, టౌమ్స్ నౌ, లోక్ పాల్, పొలిటికల్ క్రిటిక్, టౌమ్స్ నౌ నవ భారత్ లాంటి పలు సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. అయితే ఇలా వచ్చిన వాటిల్లో ఎవరికి అనుకూలంగా ఉండే వాటిని ఆయా పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ఫలితాలు అనుకూలంగా వస్తే ఒకలా.. ప్రతికూలంగా వస్తే మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది.


తాజాగా టీడీపీ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. సీ ఓటర్ సర్వే తమ ఫలితాల్లో కూటమే గెలుస్తుందని చెప్పడంతో వైసీపీ తన అనుకూల మీడియా ద్వారా వ్యతిరేక వార్తా కథనాలు ప్రచురించింది. ఇది విశ్వసనీయత లేనదని దుమ్మెత్తి పోస్తోంది. గతంలో ఆ సంస్థ ఇచ్చిన తప్పుడు సర్వేలను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మొత్తంగా ఇప్పుడు ఏపీలో సర్వేలను విమర్శించడం కూడా ఒక అంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: