ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు, ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం థైరాయిడ్, పిసిఓడి,  పీసిఓఎస్.  ఏ హాస్పిటల్ కి వెళ్ళినా సరే ముందు పి సి ఓ డి , పీ సి ఓ ఎస్ టెస్ట్ కి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు.  అమ్మాయిలలో ఈ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  మరీ ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ట్రై చేస్తున్నారో వాళ్లకి పిల్లలు కలగలేని పక్షంలో ముందుగా డాక్టర్లు సజెస్ట్ చేసే టెస్టులు పిసిఒడి ,పిసిఒఎస్ . ప్రతి 100 మందిలో 70 మందికి ఇప్పుడు ఈ పీసీఓడీ ,పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి . దానికి మెయిన్ రీజన్ మారిన ఆహారపు అలవాట్లు. అంతేకాదు వర్కింగ్ స్టైల్ . ఆడవాళ్లు ఒకప్పుడు ఎక్కువగా ఇంట్లో వండినవే తినేవారు.  బయట ఫుడ్ అసలు తినేవారు కాదు . అంతే కాదు గర్భం దాల్చిన తొమ్మిది నెలలు ఒళ్ళు వంచి పని చేసుకుని నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళు.


కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలు బెడ్  రెస్ట్ అంటూ మంచం దిగట్లేదు . తద్వారా సీ సెక్షన్ లు ఎక్కువైపోతున్నాయి . అంతేకాదు మారిన ఆహారపు అలవాట్లు కూడా ఈ పీసీఓడీ , పీసీఓఎస్ పెరగడానికి ప్రధాన  కారణం అంటున్నారు డాక్టర్లు . బయట ఫుడ్స్ ఎక్కువగా తినేయడం .. దానికి తగ్గట్టు వర్క అవుట్స్ చేయకపోవడం . ఆ కేలరీలు  కొలెస్ట్రాల్ గా మారి కొవ్వుగా పేరుకుపోవడం జరుగుతుంది. ఒబిసిటీ కారణంగా బాధపడే వాళ్లకు ఈ పీసీఓడీ , పీసీఓఎస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొంతమంది ఆడవాళ్లు కొన్ని సంవత్సరాలుగా పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యతో బాధపడుతూ గర్భం దాల్చలేకపోతున్నారు.  మరీ ముఖ్యంగా కొన్ని పనులు చేస్తే పీసీఓడీ , పీసీఓఎస్ ఈజీగా నయం చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు .



ఒక్క టాబ్లెట్ యూస్ చేయకుండానే పీసీఓడి, పీ సి ఓ ఎస్ ప్రాబ్లమ్స్ సులభంగా తగ్గించుకోవచ్చు అంటూ డాక్టర్లు చెప్పుకొస్తున్నారు.  ఫుడ్ కంట్రోల్ . మనం ఏం తింటున్నాం..? ఎంత తింటున్నాం ..? ఏ పోర్షన్లో తింటున్నాం అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎక్కువగా తినేస్తే ఇంకా ఒళ్ళు పెరిగిపోతుంది. తద్వారా అది కొలెస్ట్రాలు గా మారి బరువు పెరగడమే కాదు బాడీలో కొవ్వు ఎక్కడికక్కడ పేరుకుపోతుంది . హార్మోన్స్ సరిగ్గ వర్క్ చేయనీకుండా చేస్తుంది. తద్వారా డయాబెటిస్ పీసీఓడి,  పీసీబీఎస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కారణంగానే ఫుడ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ .



తినే ఫుడ్ క్యాలరీ కౌంట్ చేసుకుని తినడం వెరీ ఇంపార్టెంట్ . ఆకుకూరలు .. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మరీ ముఖ్యంగా మనం తినే ప్లేట్లో.. కార్పోహైడ్రేట్.. హెల్దీ ఫ్యాట్.. ప్రోటీన్ అన్ని ఉండేలా చూసుకోవాలి . మరి ముఖ్యంగా   ఏ ఆహారం తిన్న ఆహారాన్ని కరిగించడానికి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ . నేటి బిజీ షెడ్యూల్ లో అందరూ మార్నింగ్ లేసి పరిగెత్తుకుంటూ ఆఫీస్ కి వెళ్లి కంప్యూటర్ మీద కూర్చొని రాత్రి ఆరు , ఏడూ , ఎనిమిది గంతలకి ఇంటికి వస్తున్నారు.  అలసిపోయామంటూ బయటనుంచి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తినేసి  పడుకునేస్తున్నారు . తద్వారా బాడీలో ఉన్న క్యాలరీ కౌంట్ కరగ తీయడానికి చాన్స్ లేకుండా పోతుంది.  ఆ కారణంగానే కచ్చితంగా రోజుకి 20 నిమిషాలైనా సరే వర్కౌట్ అనేది చేయాలి . అట్లీస్ట్ వాకింగ్ చేయాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . వ్యాయామం చేస్తూ ఫుడ్ ని కంట్రోల్ చేస్తూ ముందుకు వెళితే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ..పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు ఈజీగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: