అన్ని దానులను నన్న దానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ వినురవేమ.!
అన్నింటికంటే ఘనమైనది అన్నదానము ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు.
కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమి లేదు. జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరు లేరు ఇవి నిత్య సత్యాలు!
మరింత సమాచారం తెలుసుకోండి: